చాలా మంది హాట్ హీరోయిన్స్ తమ క్రేజ్ కాస్త తగ్గినట్టు అనిపిస్తే ఓ చిట్కా ప్రయోగిస్తారు! ఘాటైన ఫోటోషూట్ ఏర్పాటు చేసి… టాప్ లెస్ గా ఫోజిస్తారు! ఇంకేముంది… జనం గగ్గోలు పెట్టేస్తారు. కావాల్సింది కూడా అదే కదా….
ఒకప్పుడు హీరోయిన్స్ కే పరిమితం అయిన టాప్ లెస్ టెక్నిక్ గత కొంత కాలంగా హీరోలకు కూడా ఉపయోగపడుతోంది. అయినా టాప్ లెస్ ఫోజుల గురించి మాట్లాడుకుంటుంటే… వెంటనే గుర్తొచ్చే బాలీవుడ్ కండల వీరుడు ఎవరు? సల్మానే! ఆయన షర్ట్ వేసుకుని ఆశ్చర్యపరిచిన దాని కంటే ఎక్కువ విప్పేసి మాత్రమే అదరగొట్టాడు. అయితే, సల్మాన్ తరువాత చాలా మంది సిక్స్ ప్యాక్ చూపిస్తూ సెక్సీ పిక్సప్ లో కనిపించారు. ఇక ఇప్పుడు ‘పఠాన్’గా ముస్తాబవుతోన్న కింగ్ ఖాన్ వంతు వచ్చింది…
Read Also: డాక్టర్ ను పెళ్ళాడిన బుల్లితెర యాక్టర్!
కెరీర్ లో ఎప్పుడూ పెద్దగా కండల మీద దృష్టి పెట్టని షారుఖ్ వయస్సు పెరిగే కొద్దీ ఫిట్ నెస్ పై శ్రద్ధ చూపిస్తున్నాడు. అంతే కాదు, ఇంతకు ముందు ‘ఓం శాంతి ఓం’ సినిమాలో తన జిమ్ బాడీ చూపించి నోళ్లు వెళ్లబెట్టించాడు! అయితే, మళ్లీ ఎప్పుడూ షర్ట్ విప్పి హడావిడి చేయని ఎస్ఆర్కే ఇప్పుడు ఇంకోసారి టాప్ లెస్ గా కెమెరా ముందుకొచ్చి సోషల్ మీడియా టాపిక్ గా మారాడు…
బాలీవుడ్ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నానీ తాజాగా ఓ ఫోటో విడుదల చేశాడు. అందులో షారుఖ్ ఖాన్ షర్ట్ లెస్ గా, నరాలు తేలిన తన భుజాల్ని చూపిస్తూ ఫోజిచ్చాడు. గడ్డంతో మ్యాన్లీగా ఉన్న బాలీవుడ్ బాద్షా 50 ప్లస్ ఏజ్ లోనూ యూత్ ను ఆకట్టుకోగలిగాడు. కానీ, హఠాత్తుగా ఈ హాట్ పిక్ ఇప్పుడెందుకు బయటకు వచ్చిందని సొషల్ మీడియాలో చర్చ మొదలైంది. డబ్బూ రత్నానీ 2021 క్యాలెండర్లో మన విజయ్ దేవరకొండ సహా సైఫ్ అలీఖాన్, కియారా అద్వాణీ, ఆలియా భట్ లాంటి చాలా మంది స్టార్స్ ఫోజులిచ్చారు. వారి పిక్స్ అన్నీ ఎప్పుడో విడుదలయ్యాయి. షారుఖ్ ఇమేజ్ మాత్రం ఇంత కాలం గోప్యంగా ఉంచారు. ఇప్పుడు ఇంటర్నెలో వెలుగు చూసింది? ఈ స్ట్రాటజీలో పరమార్థం ఏంటి?
‘జీరో’ మూవీతో దారుణమైన ఫ్లాప్ మూటగట్టుకున్న షారుఖ్ ఎలాగైన సూపర్ హిట్ కొట్టే యోచనలో ఉన్నాడు. అందుకే, యశ్ రాజ్ ఫిల్మ్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘పఠాన్’లో సరికొత్తగా నటిస్తున్నాడు. ఆ సినిమాలో తాను ఎలా కనిపించేదీ… చిన్న హింట్ ఇచ్చాడంటున్నారు… కొందరు నెటిజన్స్! కింగ్ ఖాన్ లెటెస్ట్ ఫోటో చూసిన ఎవరైనా ‘పఠాన్’లో ఆయన లుక్ అదిరిపోతుందని భావిస్తున్నారు. ఇలా హైప్ ఏర్పడటం కోసమే ఈ సమయంలో డబ్బూ రత్నానీ తన సూపర్ పిక్ రిలీజ్ చేశాడా? అయ్యి ఉండవచ్చు! చూడాలి మరి, ‘పఠాన్’గా బాలీవుడ్ బాద్షా బాడీ షో ఎంత వరకూ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ అవుతుందో!