Crime News: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. 11వ తరగతి విద్యార్థి పీయూష్ సింగ్ అలియాస్ యశ్‌ను దారుణంగా హత్య చేసిన ఘటన ఆ ప్రాంతాన్ని భయబ్రాంతులకు గురి చేసింది. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు సరణ్ సింగ్ అరెస్టు కాగా, తాజాగా ఈ హత్య వెనుక కారణంగా నిలిచిన మంత్రగాడిని కూడా పోలీసులు పట్టుకున్నారు. CM Revanth Reddy: అక్బరుద్దీన్.. నాతో మజాక్ చెయ్, ప్రభుత్వంతో వద్దు! పోలీసుల ప్రకారం..…
ఉమ్మడి మెదక్ జిల్లాలో చేతబడి పేరుతో హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. చేతబడులు చేస్తున్నారన్న అనుమానంతో తోడబుట్టిన వాళ్ళను హత్య చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మూడు రోజుల వ్యవధిలో రెండు దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. సాంకేతిక యుగంలోనూ మూఢ నమ్మకాలను బలంగా నమ్ముతున్నారు జనం. ఏదైనా రోగం వస్తే మంత్రాలతోనే వచ్చిందని నమ్ముతున్నారు.
గుప్తనిధుల పేరిట ప్రజలను మోసం చేస్తున్న దొంగ స్వాములను కరీంనగర్ పోలీస్ లు అరెస్టు చేశారు.శ్రీరాముల పల్లె గ్రామనికి చెందిన గజ్జి ప్రవీణ్ ఇంట్లో ఆరోగ్యం బాగో ఉండడం లేదు, ఇబ్బందులు ఎదురవుతున్నాయని దొంగ స్వాములను ఆశ్రయించాడు .మీ ఇంటి పక్కనే క్వింటాల్ వరకు బంగారం కడ్డీ ఉందని, దానిని బయటికి తీసి పూజలు చేస్తే మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుపడుతుందని, లేకపోతే మీ ఇంట్లో వారు చనిపోతారని నమ్మబలికారు దొంగ స్వాముల ముఠా .…
అల్లూరి జిల్లా అరకులోయ మండలం గన్నెల పంచాయితీ డప్పుగుడ గ్రామంలో గడబంటు భీమన్న(46) హత్యకు గురయ్యాడు. హత్య చేసిన చిట్టపురి పొల్లు అనే వ్యక్తి హత్యకు వాడిన కత్తితో సహా అరకులోయ పోలీస్ స్టేషన్‌లో వెళ్లి లొంగిపోయాడు. హత్యకు ఆర్థిక వ్యవహారాలే కారణమని డిఎస్పీ షేక్ సహాబాజ్ అహమద్ తెలిపారు. ఓ వైపు హత్యకు ఆర్థిక వ్యవహారాలే కారణమని చెబుతుండగా.. గ్రామస్థులు, బంధువులు మాత్రం హత్యకు చేతబడే కారణమని చెపుతున్నారు.
సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్షుద్ర పూజ కలకలం సృష్టించింది. ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వేకువజామున పాఠశాల ఆవరణలో మేకపిల్లను బలి ఇచ్చే ప్రయత్నం చేసినట్లు సమాచారం. పూజల కోసం ఉదయం ఐదు గంటల సమయంలో పాఠశాల గేటు తెరిచి ఉంచిన రికార్డ్ అసిస్టెంట్ వెంకటేశం, బలిపూజ కోసం ఏర్పాట్లు చేసినట్లు గుర్తించారు. ఈ విషయం బయటపడిన వెంటనే వెంకటేశం అక్కడి నుంచి…
Black Magic: బీహార్ ఔరంగాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చేతబడి, తంత్ర విద్యకు ఓ వ్యక్తి బలయ్యాడు. అత్యంత దారుణంగా అతడి తల నరికి, మొండాన్ని అగ్నిలో కాల్చేశారు. ఈ ఘటనలో మరణించిన వ్యక్తిని 65 ఏళ్ల యుగుల్ యాదవ్‌గా గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ఇందులో తాంత్రికుడి బంధువు కూడా ఉన్నాడు.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో హత్యకు గురైన మాజీ మర్చంట్ నేవీ అధికారి సౌరబ్ కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఇందుకు సంబంధించిన విషయాలను పోలీసులు మీడియాతో పంచుకున్నారు. చేతబడి, నగదు బదిలీలపై కీలక విషయాలను పంచుకున్నారు. సౌరబ్ భార్య ముస్కాన్ డ్రగ్స్, మద్యానికి బానిసై అయినట్లుగా తెలిపారు.
Black magic: ఘజియాబాద్‌లో అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్‌లో క్షుద్రవిద్యలు నేర్చుకుని, ఓ వ్యక్తి తల నరికి బలి ఇచ్చిన ఘటన జరిగింది. బాధితుడి పుర్రెని ఉపయోగించి, పూజలు నిర్వహించి ధనవంతులు కావాలనుకున్న నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి పుర్రె, ఆయుధాలు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ పాతబస్తీలోని బండ్లగూడలో అత్త మామలను చంపేందుకు కుట్ర పన్నింది ఓ కోడలు. ఇందుకోసం బ్లాక్ మ్యాజిక్ ను చేసే బురిడి బాబును ఆశ్రయించింది. బ్లాక్ మ్యాజిక్ తో అత్తమామలను చంపేందుకు తనను ఆశ్రయించిన మహిళను బురిడీ కొట్టించాడు నకిలీ బాబా మహమ్మద్ ఖలీద్.. నాజియా అనే మహిళ తన అత్తమామలను బ్లాక్ మ్యాజిక్ తో చంపాలని కుట్ర పన్నింది. అయితే ఆమెనే మోసం చేసే సరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన…