హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఘరానా మోసం జరిగింది. మంత్రాలతో చేతబడిని తొలగిస్తాను, దెయ్యాన్ని తొలగిస్తాను అంటూ నమ్మించి గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళకు టోకరా వేసిన ఘటన ఫిల్మ్‌నగర్‌లో చోటుచేసుకుంది.
Guntur : ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ రైతును హత్య చేసి మృతదేహాన్ని పొలంలో పడేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మృతుడి చేతి గోళ్లు మాయమయ్యాయి.
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో క్షుద్రపూజల కలకలం రేపుతుంది. కాండ్రకోట గ్రామంలోని ఒక ఇంటి ముందు ముగ్గు వేసి పసుపు, కుంకుమ, ఎండు మిర్చిలతో పూజలు చేసిన ఆనవాళ్లు గుర్తించిన స్థానికులు హడలిపోతున్నారు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే వింత ఆరోపణలు చేశారు. ప్రజలు తనపై చేతబడి ప్రయోగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. లఖింపూర్ ఖేరీ జిల్లా మెమహ్మదీ ఎమ్మెల్యే అయిన లోకేంద్ర ప్రతాప్ సింగ్ తన ఫేస్‌బుక్ పేజీలో ఈ ఫిర్యాదు చేశారు. తనను లక్ష్యంగా చేసుకుని చేతబడి చేస్తున్నారని, ఓ ఫోటోను పోస్ట్ చేశారు.
Maharashtra: తప్పుడు మాటలు చెబుతూ, చేతబడులను, దోషాలను వదిలిస్తామంటూ కొందరు బాబాలు, మాంత్రికులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చాలానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే జరిగింది. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో వాస్తుదోషాలు, చెడు దోషాలు వదిలిస్తానని చెబుతూ 35 ఏళ్ల మహిళపై ఓ వ్యక్తి పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు.
మూఢనమ్మకాల పేరుతో కొందరు వ్యక్తులు ప్రజలను మోసం చేస్తున్నారు. నేల నుండి నింగికి చేరుకునే సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా.. ప్రజల్లో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. కళ్లకి ఎదురుగా మూఢనమ్మకాల పేరుతో డబ్బు దోచుకుంటున్న అపరచితులని గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు.
Black Magic: చేతబడి చేస్తున్నారనే అనుమానంతో దంపతులను చెట్టుకు ప్రమాదకర రీతిలో వేలాడదీశారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
Black magic: టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ప్రపంచం ముందుకు సాగుతున్నా.. సైన్స్ శరవేగంగా అభివృద్ధి చెందుతూ అంతరిక్షంలో దూసుకుపోతున్నా.. కొన్ని మూఢనమ్మకాలు మాత్రం ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి.
ఏలూరు జిల్లా కైకలూరులో క్షుద్ర పూజల కలకలం రేపుతుంది. కైకలూరు మండలం వేమవరం పాడు గ్రామంలో రాత్రి క్షుద్ర పూజలు చేస్తున్నారని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో హుటాహుటిన పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. పోలీసులు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన చెరువుపై పూజ చేసుకుంటుండగా క్షుద్ర పూజ అనే అనుమానంతో గ్రామస్తులు అడ్డుకున్నారు.