Crime News: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. 11వ తరగతి విద్యార్థి పీయూష్ సింగ్ అలియాస్ యశ్‌ను దారుణంగా హత్య చేసిన ఘటన ఆ ప్రాంతాన్ని భయబ్రాంతులకు గురి చేసింది. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు సరణ్ సింగ్ అరెస్టు కాగా, తాజాగా ఈ హత్య వెనుక కారణంగా నిలిచిన మంత్రగాడిని కూడా పోలీసులు పట్టుకున్నారు.
CM Revanth Reddy: అక్బరుద్దీన్.. నాతో మజాక్ చెయ్, ప్రభుత్వంతో వద్దు!
పోలీసుల ప్రకారం.. ఈ హత్యకు కారణం మంత్రగాడి “బలి” సూచన. ప్రధాన నిందితుడు సరణ్ సింగ్, సంబంధాల పరంగా బాధిత విద్యార్థి యశ్‌కు తాతయ్యవుతాడు. ఆగస్టు 26న స్కూల్‌కు వెళ్లే సమయంలో సరణ్ సింగ్ యశ్‌ను ఇంటికి పిలిచి, ఆపై హత్య చేసి శవాన్ని తొమ్మిది ముక్కలు చేశాడు. ఆ తరువాత వాటిని వివిధ చోట్ల పారవేశాడు. ఇక ఈ హత్య వెనుక తాంత్రికుడు మున్నాలాల్ (45) పాత్ర ఉందని దర్యాప్తులో తేలింది. అతను కౌశాంబీ జిల్లాలోని ధుస్కహా గ్రామానికి చెందినవాడు. తాంత్రిక విద్యల పేరుతో ప్రజలను మోసం చేస్తూ వచ్చాడు. అతన్ని ఆదివారం సాయంత్రం కరేలీ లేబర్ చౌరాహా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Tollywood : కోడల్ని కూతురిలా చూసుకున్న..వేరే కాపురం పెట్టిన నాగ శౌర్య తల్లి ఎమోషనల్ కామెంట్స్
పోలీసు విచారణలో మున్నాలాల్ నేరాన్ని అంగీకరించాడు. సరణ్ సింగ్ కుటుంబంలో జరిగిన ఆత్మహత్యల కారణంగా అతను మానసికంగా కలత చెందగా, తన ఇంట్లో చెడుఆత్మల ప్రభావం ఉందని చెప్పి మోసం చేశాడు. యశ్‌ను బలి ఇవ్వాలని సలహా ఇచ్చాడు. అంతేకాకుండా శవాన్ని తొమ్మిది ముక్కలు చేసి వేర్వేరు దిశల్లో పడేయమని సూచించాడు. ప్రధాన నిందితుడు సరణ్ సింగ్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇప్పుడు మంత్రగాడు మున్నాలాల్ పట్టుబడడంతో కేసు కీలకమైన మలుపు తిరిగింది. పోలీసులు అతనిని మరింతగా విచారిస్తున్నారు. మొత్తానికి, తాంత్రిక మోసాల వల్ల అమాయక విద్యార్థి ప్రాణం బలైపోవడం సమాజాన్ని కుదిపేసింది.