ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో హత్యకు గురైన మాజీ మర్చంట్ నేవీ అధికారి సౌరబ్ కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఇందుకు సంబంధించిన విషయాలను పోలీసులు మీడియాతో పంచుకున్నారు. చేతబడి, నగదు బదిలీలపై కీలక విషయాలను పంచుకున్నారు. సౌరబ్ భార్య ముస్కాన్ డ్రగ్స్, మద్యానికి బానిసై అయినట్లుగా తెలిపారు.
సౌరబ్ రాజ్‌పుత్ర మాజీ మర్చంట్ నేవీ అధికారి. ప్రస్తుతం లండన్‌లో ఉంటూ బేకరీలో పని చేస్తున్నాడు. సౌరబ్-ముస్కాన్ దంపతులకు ఆరేళ్ల పాప ఉంది. అయితే కుమార్తె పుట్టినరోజు కోసం ఫిబ్రవరి 24న సౌరబ్ భారత్‌కు వచ్చాడు. ఫిబ్రవరి 25న ముస్కాన్.. ఆమె ప్రియుడు సాహిల్.. సౌరబ్‌ను చంపాలని ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. కానీ ఆరోజు ప్రయత్నం సక్సెస్ కాలేదన్నారు. మార్చి 3న మాత్రం ప్రణాళిక పక్కాగా అమలు చేశారని పేర్కొన్నారు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు చేసి ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి సిమెంట్ పోసేశారన్నారు. అయితే ఇందులో చేతబడి ఏదైనా ఉందా? అన్న కోణంలో పోలీసులు అనుమానిస్తు్న్నారు. ప్రస్తుతం దీనిపై మరింత దర్యాప్తు జరగాలని వెల్లడించారు. ఇక ముస్కాన్ బాలీవుడ్‌లో ఎదగాలని భావించినట్లుగా తెలిపారు.
ఇక సౌరబ్‌ను చంపేశాక.. ముస్కాన్, ప్రియుడు సాహల్ హిమాచల్‌ప్రదేశ్‌కు పారిపోయారని.. తిరిగి రెండు రోజుల తర్వాత వచ్చారన్నారు. అప్పటికే డ్రమ్ములోంచి వాసన రావడంతో ఓనర్ ఇల్లు ఖాళీ చేయించే ప్రయత్నం చేశాడన్నారు. అంతేకాకుండా ఆరేళ్ల కుమార్తె.. తన తండ్రి.. ఈ డ్రమ్ములో ఉన్నాడని స్థానికులకు చెప్పినా లైట్ తీసుకున్నారు. మొత్తానికి చిన్నారి చెప్పిందే నిజమైంది. ఇక నిందితులను అరెస్ట్ చేయగా.. ఇద్దరూ నేరాన్ని అంగీకరించారని మీరట్ నగర పోలీసు సూపరింటెండెంట్ ఆయుష్ విక్రమ్ సింగ్ చెప్పారు. ఇప్పటి వరకు వచ్చిన వివరాలు మాత్రమే చెబుతున్నామని.. ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు.
ముస్కాన్-సౌరబ్‌కు 2016లో ప్రేమ వివాహం జరిగింది. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలువలేదు. మొదటి నుంచి ముస్కాన్ తేడాగానే ఉంది. ఇక 2021లో ముస్కాన్-సాహిల్ ఇద్దరూ కూడా అభ్యంతరకరమైన పరిస్థితుల్లో
సౌరబ్ కంటపడ్డారు. వాళ్లిద్దరినీ చూడలేని స్థితిలో చూసి సౌరబ్ కుంగిపోయాడని.. దీంతో 2021లో ముస్కాన్‌కు విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని కోర్టులో అప్లై చేశాడని.. కానీ కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు.. కుమార్తె భవిష్యత్ కోసం సౌరబ్ వెనక్కి తగ్గాల్సి వచ్చిందని పోలీసులు వివరించారు.
ఇక విచారణలో సాహిల్‌తో 2019 నుంచి వివాహేతర సంబంధం ఉన్నట్లుగా ముస్కాన్ చెప్పిందన్నారు. సాహిల్ అప్పటికే మద్యానికి బానిస అని.. అంతేకాకుండా ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగేవని ముస్కాన్ పేర్కొంది. సాహిల్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే.. తానే ఆర్థిక సహాయం చేసినట్లుగా ముస్కాన్ పోలీసులకు చెప్పుకొచ్చింది. సాహిల్ కారణంగానే ముస్కాన్‌కు కూడా డ్రగ్స్, మద్యం అలవాటైంది. సాహిల్‌ను ఎప్పుడు కలిసినా మద్యం సేవించినట్లుగా విచారణలో ముస్కాన్ చెప్పుకొచ్చింది.
ఇక డ్రమ్ము ఎక్కడ కనుగోలు చేశారో దుకాణదారుడిని పోలీసులు గుర్తించి విచారించారు. ఇక హత్యకు మరిన్ని పరికరాలు కొనుగోలు చేశారు. వాటిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇక సిమ్లాకు కూడా ఒక పోలీస్ బృందం వెళ్తోందని.. అక్కడ మరిన్ని ఆధారాలు సేకరించబోతున్నట్లు వెల్లడించారు. ఫోన్‌లను ఫోరెన్సిక్ పంపిచినట్లు తెలిపారు. త్వరలోనే చార్జిషీటు వేస్తామని.. కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు తెలిపారు.
ఇక శరీరాన్ని ముక్కలు చేయడానికి.. ఇందులో ఏమైనా చేతబడి ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని.. దీనిపై మరిన్ని ఆధారాలు దొరకాలన్నారు. అసలు డ్రమ్ములో ఎందుకు పెట్టాల్సి వచ్చిందో కూడా విచారణ చేస్తామన్నారు. ఇది బాగా ఆలోచన చేసి.. కుట్ర పన్నిన తర్వాతే హత్య చేసినట్లుగా కనిపిస్తుందన్నారు.
ఇక సౌరభ్ ఖాతాలో రూ.6 లక్షలు ఉన్నాయని, రూ.లక్ష ముస్కాన్ ఖాతాలో.. మరో లక్షన్నర.. ఆమె తల్లి ఖాతాలో బదిలీ చేసిందని తెలిపారు. సౌరబ్ లండన్ పర్యటనలపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ముస్కాన్.. తన తల్లికి నేరం గురించి చెప్పిందని.. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు పోలీసులు తెలిపారు.