ఆగస్టు 5న నల్లబట్టలు ధరించి 'ధరల పెరుగుదల'పై కాంగ్రెస్ చేపట్టిన నిరసనపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నాడు కాంగ్రెస్‌పై మండిపడ్డారు. కొందరు నిరాశ, నిస్పృహల్లో మునిగి చేతబడిని ఆశ్రయిస్తున్నారంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
టెక్నాలజీ ఎంత పెరిగినా ఇంకా మూఢనమ్మకాలు మాత్రం వీడడం లేదు. కర్నూలు జిల్లాలో శ్రీశైలం తర్వాత ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. మంత్రాలయం మండలం కల్దేదేవకుంట సహకారసంఘం కార్యాలయంలో క్షుద్రపూజలు జరిగాయన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. తోటి సిబ్బందిపై సహకారసంఘం సీఈవో వెంకటేశ్ చేతబడి చేయించారని సిబ్బంది ఆరోపించారు. దీంతో సీఈవో వెంకటేశ్ పై సిబ్బంది బంధువులు దాడికి పాల్పడ్డారు. Read Also: Beeda Ravichandra: మంత్రుల డ్యూటీ విపక్షాన్ని తిట్టడమేనా? దీంతో పోలీసులు…
టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా పాత ఆనవాళ్ళు, మూఢాచారాలు మాత్రం మానడంలేదు. ఎక్కడో చోట క్షుద్రపూజలు, చేతబడుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. భార్యతో క్షుద్ర పూజలు చేయించాడో ఆర్ఎంపీ భర్త. పూజారితో సంసారం చేయాలంటూ భార్యపై ఒత్తిడి చేశాడా భర్త. దీనికి ఒప్పుకోని భార్య తప్పించుకుపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఖమ్మం జిల్లా మధిరలో ఓ ఆర్ఎంపీ భర్త నిర్వాకం ఇది. తన భార్య చేత క్షుద్ర పూజలు చేయించి పూజారితో సంసారం చేయాలంటూ ఒత్తిడి చేయడంతో భార్య…
మూడో భార్య కోసం రెండో భార్యకు నిత్య పెళ్లికొడుకు క్షుద్ర పూజలు చేయడం కలకలం రేపింది. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచలో నిత్య పెళ్ళికొడుకు బాగోతం బట్టబయలయింది. రెండోభార్యను హతమార్చేందుకు నిత్య పెళ్ళికొడుకుఈ దారుణానికి ఒడిగట్టాడు. కంప్యూటర్ యుగంలోనూ తాంత్రిక పూజలు చేయడం సంచలనం కలిగించింది. పాల్వంచ మండలం శేఖర బంజరకు చెందిన కుమార్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ళ క్రితం ఒక మహిళను పెళ్ళాడాడు. వీరికి పిల్లలు కూడా వున్నారు. మరో మహిళను రెండో…
దేశంలో దొంగ బాబాల గురించి నిత్యం వార్తలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయినా ప్రజలు బాబాల మీద నమ్మకంతో వారిని ఆశ్రయిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఓ దొంగబాబు రాసలీలలు బయటపడ్డాయి. ఆ నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు చాంద్రాయన్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగ బాబా, అతడి కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రాల పేరుతో ఇద్దరు యువతులపై ఓ బాబా అత్యాచారానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళ్తే… అనారోగ్యానికి గురైన తల్లిని కాపాడుకునేందుకు…
కర్నూలు జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో తరచూ ఇలాంటివి జరగడంతో భయాందోళనలు నెలకొన్నాయి. పత్తికొండ మండలం పందికోన ఫారెస్ట్ లో క్షుద్రపూజలు జరిగాయి. మట్టితో తయారు చేసిన బొమ్మలు, నిమ్మకాయలు, కోడిగుడ్లతో భారీ ఎత్తున క్షుద్రపూజలు జరిగాయని తెలుస్తోంది. క్షుద్రపూజలు చేసిన ప్రదేశాన్ని చూసిన గొర్రెల కాపరులు. అటువైపు వెళ్లాలంటే భయపడుతున్నారు. గొర్రెల కాపరులు ఫారెస్ట్ లో క్షుద్రపూజలపై భయాందోళనలకు గురవుతున్నారు. ఇలాంటి తాంత్రిక పూజల పై విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.