Black Magic : సాంకేతిక విజ్ఞానం, ఇంటర్నెట్‌తో ప్రపంచం అణువణువూ దగ్గర అవుతున్న రోజుల్లోనూ, మూఢనమ్మకాల ముసుగులో జరిగే సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంపు ప్రాంతంలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి ఘటన చోటుచేసుకుని కలకలం రేపింది. దసరా సెలవులు ముగిసిన అనంతరం శనివారం (అక్టోబర్ 4) పాఠశాల తిరిగి ప్రారంభమైంది. అయితే, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలకు చేరుకున్నప్పుడే వింత దృశ్యాలు కళ్లపడాయి. పాఠశాల వరండాలో ముగ్గులు వేసి, పసుపు, కుంకుమ చల్లి, నిమ్మకాయలు ఉంచి, దీపం వెలిగించిన ఆనవాళ్లు కనబడటం అందరినీ షాక్‌కు గురిచేసింది. సాధారణంగా దేవాలయాల్లో జరిగే పూజలు విద్యాలయ ప్రాంగణంలో జరగడం విద్యార్థుల్లో భయాందోళనకు దారితీసింది.
ఇది ఒక్కసారిగా జరిగిన సంఘటన కాదని, గతంలోనూ ఈ పాఠశాలలో ఇలాంటి మూఢనమ్మకాల ప్రదర్శనలు చోటుచేసుకున్నాయని స్థానికులు గుర్తుచేశారు. అప్పట్లో ఒక పావురాన్ని బలి ఇచ్చి, ఆ శవాన్ని స్కూల్ గంటకు వేలాడదీసిన ఘటన విద్యార్థులను భయబ్రాంతులకు గురి చేసింది. ఈసారి మళ్లీ ఇలాంటి సంఘటన జరగడం విద్యాలయం మూఢవిశ్వాసాల వేదికగా మారుతుందనే భయాలను తల్లిదండ్రుల్లో రేకెత్తిస్తోంది.
War 2 : నా చేతుల్లో లేదు.. వార్-2 డిజాస్టర్ పై హృతిక్ పోస్ట్
పాఠశాల అనేది విద్య, విజ్ఞానం, విలువల బోధనకు కేంద్రబిందువుగా ఉండాల్సిన ప్రదేశం. కానీ ఇక్కడ ఇలాంటి క్షుద్ర పూజలు జరగడం వలన చిన్నారుల మనస్తత్వంపై ప్రతికూల ప్రభావం పడుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కంప్యూటర్ యుగంలో పోటీ పరీక్షలు, సాంకేతిక నైపుణ్యాలు, భవిష్యత్తు కెరీర్‌ల గురించి చర్చ జరుగుతుంటే… మరోవైపు పాఠశాలలో మూఢనమ్మకాలు ఆచరణలోకి రావడం సామాజికంగా వెనకడుగు వేయడమేనని పలువురు విమర్శిస్తున్నారు.
స్థానికులు చెబుతున్న దాని ప్రకారం, పాఠశాలకు కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. బయటివారు సులభంగా లోనికి వచ్చి, పాఠశాలలో క్షుద్ర పూజలు నిర్వహించే అవకాశం ఉందని వారు అంటున్నారు. విద్యార్థుల భద్రత కోసం, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు తక్షణమే కాంపౌండ్ వాల్ నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో జిల్లా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. “విద్యార్థులు భయపడే వాతావరణంలో చదువు కొనసాగించడం అసాధ్యం. ఇలాంటి మూఢనమ్మకాలు చోటుచేసుకోకుండా పాఠశాలకు తగిన రక్షణ కల్పించాలి” అని వారు స్పష్టం చేస్తున్నారు.
Team India Squad: రోహిత్ శర్మ, విరాట్ సహా ఆస్ట్రేలియాతో తలపడేది వీళ్ళే!