గుప్తనిధుల పేరిట ప్రజలను మోసం చేస్తున్న దొంగ స్వాములను కరీంనగర్ పోలీస్ లు అరెస్టు చేశారు.శ్రీరాముల పల్లె గ్రామనికి చెందిన గజ్జి ప్రవీణ్ ఇంట్లో ఆరోగ్యం బాగో ఉండడం లేదు, ఇబ్బందులు ఎదురవుతున్నాయని దొంగ స్వాములను ఆశ్రయించాడు .మీ ఇంటి పక్కనే క్వింటాల్ వరకు బంగారం కడ్డీ ఉందని, దానిని బయటికి తీసి పూజలు చేస్తే మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుపడుతుందని, లేకపోతే మీ ఇంట్లో వారు చనిపోతారని నమ్మబలికారు దొంగ స్వాముల ముఠా . అందుకోసం విడతల వారీగా 15 లక్షల 30వేల రూపాయల నగదును పూజా సామాగ్రి పేరుతో దొంగ స్వాములు వసూలు చేశారు.
Lakshmi Narasimha Swamy Temple : ఒక్క దర్శనంతో సమస్యలన్నీ దూరం..
డబ్బులు తీసుకున్న తర్వాత నిందితులు కొంత పూజ సామాగ్రి కొనుగోలు చేసి ఇంటి పక్కనే ఒక గొయ్యి తవ్వి కుంకుమ పసుపు చల్లి అందులో నుంచి ముందుగా ఏర్పాటు చేసుకున్న ఒక డబ్బా నువ్వు బయటికి తీసి ఇందులో బంగారం ఉందని నమ్మబలికారు. ఇంకా డబ్బులు కావాలని వేధింపులకు గురి చేయడంతో కొత్తపల్లి పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు గజ్జి ప్రవీణ్ . బాధితుడు ఇచ్చిన పిర్యాదు మేరకు ఈన్నాల రాజు, మిర్యాల దుర్గయ్య, పెనుగొండ రాజు, చల్ల అజయ్, ఈర్నాల సతీష్ లను పోలీసులు అరెస్టు చేసినట్లు ఏసీపీ శుభం ప్రకాష్ . వారి వద్ద నుండి 15 లక్షల 30 వేల నగదు తో పాటు, ఏడు తులాల బంగారం, మూడు కార్లు, 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్ తెలిపారు.
Suruchi Singh: ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ గోల్డ్ ను సాధించిన సురుచీ సింగ్..!