ప్రధాని నరేంద్ర మోడీ తెస్తానన్న అచ్చే దిన్ అంటే ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం, తాకట్టు పెట్టడమేనా? అని ప్రశ్నించారు రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మల్లికార్జున ఖర్గే.. హైదరాబాద్ వచ్చిన ఆయన.. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోందని విమర్శించారు. నేడు ప్రభుత్వ రంగ సంస్థల్లో 35 లక్షల మంది పనిచేస్తున్నారని.. కానీ, మోడీ ఒక్కో రంగాన్ని ఖతం చేస్తున్నారని మండిపడ్డారు.. మరోవైపు రిజర్వేషన్లను సైతం…
ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షేకవత్ లతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ నేపథ్యం లోనే సీఎం కేసీఆర్ తన ఢిల్లీ పర్యటన ను మరో రెండు రోజుల పొడిగించుకున్నారు. గోదావరి, కృష్ణానదీ జలాల వ్యవహారం, కేంద్ర గెజిట్ పై ప్రధాని మోడీ మరియు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షేకవత్ లతో చర్చించనున్నారు సీఎం కేసీఆర్. అలాగే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల పై ప్రధాని…
ఎన్నికలంటేనే బోల్డంత ఖర్చు. పోలింగ్ తేదీ ఖరారైతే ఖర్చుకు ఒక లెక్క తెలుస్తుంది. హుజురాబాద్లో మాత్రం అంతా రివర్స్. ఉపఎన్నిక ఎప్పుడో తెలియదు. 2 నెలలుగా ప్రధాన పార్టీలు డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్నాయి. జేబులు ఖాళీ అవుతున్నాయి తప్ప ఎలక్షన్ ఎప్పుడో.. ఏంటో.. క్లారిటీ లేదు? ఇంకా ఎన్ని రోజులు.. ఎంత ఖర్చు పెట్టాలో తెలియక ఆందోళన చెందుతున్నారట నేతలు. వందల మందితో కలిసి ఎన్నికల ప్రచారం! హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు.…
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం లో జెండా పండుగ కార్యక్రమం లో పాల్గొన్న ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ… టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ భారీ మెజారితో గెలవడం ఖాయం. టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న ఈటల మాటలకు స్పందించారు ప్రభుత్వం బాల్క సుమన్. ఈటల రాజేందర్ శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకోవడానికి మానసికంగా ఇప్పటి నుండే సిద్ధం కావాలి. దమ్ముంటే కేసీఆర్, హరీష్ రావు నామీద పోటీ చేయాలనే స్థాయి…
హరీష్ రావ్ హుజూరాబాద్ లో అడ్డా పెట్టి అబద్దాల కారు కూతలు కూస్తున్నారు అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. డ్రామా కంపెనీ లాగా మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టి యాక్షన్ చేస్తున్నాడు. ప్రతి మాటలో వ్యంగ్యం, అబద్దం, ఇతరుల ఆత్మ గౌరవాన్ని కించపరిచే పద్దతి ఆపకపోతే నీ చరిత్ర ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది హరీష్ నీకు సవాలు చేస్తున్న.. అభివృద్ది జరగలేదు.. డబుల్ బెడ్ రూమ్ కట్టలేదు అని తెలిపారు. కుంకుమ భరిణలు పంపించి…
రేవంత్ రెడ్డి పీసీసీ, బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కావడానికి కారణం సీఎం కేసీఆర్ మాత్రమే. గులాబీ జెండా పుణ్యమే మీకు అధ్యక్ష పదవులు వచ్చాయని మంత్రి హరీష్ రావు అన్నారు. కాబట్టి మీరు చేయాల్సింది పాదయాత్రలు కాదు… పెంచిన గ్యాస్ , డీజిల్ ధరల పై ఢిల్లీ యాత్రలు చేయాలి. టీఆర్ఎస్ పార్టీ జల దృశ్యంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీ దాకా పోయింది. రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అభివృధి లో ఇతర రాష్ట్రాలకు…
తెలంగాణ మున్నూరు కాపు సంఘం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామయాత్రకు సంపూర్ణ మద్దతు తెలిపింది. సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుక్క వేణుగోపాల్ ఆధ్వర్యంలో సంజయ్ ను కలిశారు మున్నూరుకాపు నేతలు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… రాష్ట్ర మున్నూరు కాపు సంఘం బీజేపీ యాత్రకు మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉంది. టీఆర్ఎస్ దుర్మార్గ పాలన పోవాలని రాష్ట్రంలోని అన్ని కుల సంఘాల నాయకులు కుల సంఘాల ప్రజలు రాజకీయాలకతీతంగా…
ఢిల్లీ : కేంద్ర విద్యా, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అటవీ పర్యావరణ, కార్మిక శాఖల మంత్రి భూపేంద్ర యాదవ్ లను తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కలిశారు. రాష్ట్ర కార్మిక మంత్రిత్వ శాఖ కు స్కిల్ డెవలప్ మెంట్ కింద కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు విజ్ఞప్తి చేశారు మంత్రి మల్లారెడ్డి. నాచారంలో ఉన్న 350 బెడ్ల ఈఎస్ఐ హాస్పటల్ నిర్మాణం త్వరగా…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి జగ్గారెడ్డి సవాల్ విసిరారు. హిందువుల కోసం తాను చెప్పిన 4 అంశాల పై చర్చకు సిద్ధమా…? అని ప్రశ్నించారు. హిందువుల కోసం మోడీతో మాట్లాడి పెట్రోల్, డీజీల్ గ్యాస్ ధరలు తగ్గించగలవా ? తెలంగాణ లో ఉన్న పేద హిందువులకు రూ. 15 లక్షలు మోడీ తో ఇప్పించగలవా ? అని సవాల్ విసిరారు జగ్గారెడ్డి. తెలంగాణ లో ఉన్న 80 శాతం హిందువులకోసం మాట మీద నిలపడుతావా…
బండి సంజయ్ మతాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ పాదయాత్ర లో బిజెపి సీఎంలు ఏం చేస్తున్నారో చెప్పాలి. సంజయ్ యాత్రలో ప్రజలు ఎక్కడా లేరు… బీజేపీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారు అని తెలిపారు. ఇక 111 జీవో వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది… అది రాష్ట్రంకు సంబంధించిన విషయం కాదు. జితేందర్ రెడ్డితో పాటు మరికొంత మంది బీజేపీ నేతలకు 111 జీవో పరిధిలో…