హుషారుగా మాజీ మంత్రి ఈటలతో పాటు విమానం ఎక్కి.. ఢిల్లీలో బీజేపీ చేరిన నేతలు.. ఇప్పుడు మళ్లీ కమలం పార్టీకి బైబై చెబుతున్నారు.. తాజాగా, ఈటల ప్రధాన అనుచరుడిగా పేరున్న టి.స్కాబ్ వైస్ చైర్మన్ పింగళి రమేష్.. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో కలిసి ఢిల్లీలో బీజేపీ పార్టీలో చేరినా.. మేం ఆ పార్టీలో ఇమడలేకపోతున్నాం అన్నారు.. అందుకే…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు.. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో సాగనున్న సంజయ్ పాదయాత్ర.. ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.. ఆగస్టు 24న హైదరాబాద్ ఓల్డ్‌సిటీ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచే బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. అయితే, మరోసారి సంజయ్ పాదయాత్ర వాయిదా పడే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది… ఎందుకంటే.. యూపీ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ శనివారం కన్నుమూశారు..…
మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.. ఆయనకు ప్రధాన అనుచరులుగా ఉన్న పింగిలి రమేష్, చుక్కా రంజిత్.. ఆయనకు గుడ్‌బై చెప్పేశారు.. వీరిలో పింగిలి రమేష్ సింగిల్ విండో వైస్ చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఓవైపు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఏలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు ఈటల రాజేందర్.. తన పాత అనుచరులతో కపులుపుకుని.. బీజేపీ శ్రేణులతో మమేకం అవుతూ ముందుకు సాగుతున్నారు.. కానీ, అప్పుడప్పుడు కొందరు ఈటలకు షాక్…
రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి రావు సాహెబ్ దన్వే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. ఇక, ఆయన కామెంట్లకు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు అదే స్థాయిలో విరుచుకుపడ్డారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో జన ఆశీర్వాద యాత్రలో పాల్గొన్న రైల్వే శాఖ సహాయ మంత్రి రావు సాహెబ్ దన్వే.. కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విరురుచుకుపడ్డారు.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎవరికీ ఉపయోగపడే వ్యక్తి కాదని, ఆయన ఆంబోతు వంటివారంటూ కామెంట్ చేశారు.. ఆయన అన్ని…
కలిసి పనిచేస్తేనే పార్టీ అయినా.. మరేదైనా సక్సెస్ అవుతుంది. కానీ.. అక్కడ ఆ నేతలు ఎక్కువగా వన్ మ్యాన్ షో చేస్తుంటారు. ఎవరికి వారే మైలేజ్ కోసం ప్రయత్నిస్తూనే ఇంకొకరికి చెక్ పెట్టేందుకు ప్లాన్ చేస్తారు. ఎవరు చెప్పినా.. ఎంత చెప్పినా మారని ఆ నేతలతో ఆ పార్టీ కూడా ఎదుగూ బొదుగూ లేకుండా ఉంది. వర్గాలుగా విడిపోయిన తిరుపతి బీజేపీ.. ఎవరి శిబిరం వారిదే! ఆధ్యాత్మిక నగరం తిరుపతి కేంద్రంగా బీజేపీ కార్యకలాపాలు చురుగ్గా సాగుతుంటాయి.…
చేతి (కాంగ్రెస్ పార్టీ) దెబ్బకు కారు (టీఆర్ఎస్), పువ్వు (బీజేపీ) పల్టీ కొట్టాల్సిందేనని వ్యాఖ్యానించారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్.. యూత్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.. ధరల పెరుగుదలపై, నిరుద్యోగ సమస్యలపై చేస్తున్నారు.. కేసీఆర్ అక్రమాలపై కూడా పోరాటం చేయాలని సూచించారు.. సీఎం కేసీఆర్ కులాలలను విడదీసే కుట్ర చేస్తున్నారని ఫైర్ అయిన మధు యాష్కీ..…
జన ఆశీర్వాద యాత్రలో భాగంగా భువనగిరి పట్టణానికి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… జమ్మూకాశ్మీర్ లో 370 కి వ్యతిరేకంగా పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టాం..దాన్ని రద్దు చేసుకొని, భారత రాజ్యాంగం పరిధిలోకి తీసుకురావటం కీలక ఘట్టం..నా జీవితంలో ఇది కీలక నిర్ణయం.. క్యాబినెట్ మంత్రిగా నాకు మోడీ అవకాశం కల్పించారు. ఈశాన్య రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నాం. ఆయా రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు…
మరో ఇరవై ఏళ్లు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుంది.. కేసీఆరే ముఖ్యమంత్రిగా వుంటారు అని స్పష్టం చేశారు టీఆర్ఎస్ సీనియర్ నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి.. తాజాగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. కిషన్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.. బీజేపీ వాళ్లు పగటి కలలు కంటున్నారు.. అధికారంలోకి వస్తాం అంటూ బీజేపీ నేతలు భ్రమల్లో ఉన్నారని.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎక్కడైనా తెలంగాణలో అమలు అవుతున్న ఒక్క పథకమైన…
ఈ రోజు హైదరాబాద్ లో కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర జరగనుంది. ఇందుకోసం వస్తున్న కేంద్రమంత్రికి ఘట్కేసర్ వద్ద స్వాగతం పలకనున్నారు మేడ్చల్ జిల్లా బీజేపీ అధికారులు.నేడు మధ్యహ్నం 12 గంటలకు ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద కిషన్ రెడ్డికి హైదరాబాద్ బీజేపీ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలకనున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 50కిలోమీటర్ల జన ఆశీర్వాద యాత్ర నిర్వహించనున్నారు. సాయంత్రం 7 గంటలకు బీజేపీ కార్యాలయం వద్ద బహిరంగ సభ, కిషన్…
జన చైతన్య ఆశీర్వాద యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… ప్రధాని మోడీ నాపై నమ్మకం తో 3 శాఖలు అప్పగించారు. స్వాతంత్య్రము వచ్చాక ఎన్నడూ లేని విదంగా కేంద్ర మంత్రివర్గం లో బడుగు బలహీన వర్గాలకు చోటు కల్పించారు. ప్రజలకు దగ్గర అయ్యేందుకే ఈ జన ఆశీర్వాద యాత్ర చేపట్టాను. ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ధరించాలి. ఇంకా 200 దేశాలను కరోనా వ్యాధి పట్టి పీడిస్తుంది. గతంలో ఇతర దేశాల నుండి మందులు…