ఇది పాదయాత్ర కాదు.. కేసీఆర్ మీద దండ యాత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది.. ఇప్పటికే 100 కిలోమీటర్ల మైలురాయిని దాటేసింది.. ఇక, సంజయ్ పాదయాత్రలో కేంద్రమంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ సీఎంలు.. ఇలా రోజుకో నేత పాల్గొంటున్నారు. ఇవాళ బీజేవైఎం నేషనల్ ప్రెసిడెంట్ తేజస్వి సూర్య.. సంజయ్ పాదయాత్రలో కొద్దిసేపు తెలుగులోకి మాట్లాడారు తేజస్వి సూర్య.. బండి సంజయ్ చేసేది పాదయాత్ర కాదు కేసీఆర్ మీద చేసే దండ యాత్ర అన్న ఆయన.. తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ నినాదం నీళ్లు, నిధులు, నియమాకాలు.. కానీ, ఇప్పుడు కన్నీరు, అప్పులు, నిరుద్యోగం అన్నారు.. ఇక, కేసీఆర్‌పై చేసే ఈ ధర్మ యుద్ధంలో బీజేపీ విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు.. టీఆర్ఎస్ పాలనలో ఎవరు సంతోషంగా లేరన్న తేజస్వి సూర్య.. యువమోర్చా కార్యకర్తలను చూసి టీఆర్ఎస్ భయపడుతుందన్నారు. ఇక, అధికార పార్టీపై మండిపడ్డ ఆయన.. కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్ గూండాలకు చెబుతున్నా.. మీ గూండా గిరికి మేం భయపడమని హెచ్చరించారు. కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని సెటైర్లు వేసిన తేజస్వి సూర్య.. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. టీఆర్ఎస్ నలుగురు వ్యక్తులు ది.. కానీ, బీజేపీ ప్రతి ఒక్కరిది అన్నారు.
Also Read
- KTR: 'రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి మాత్రం సంచులు ఉన్నాయి'..
- Uday Krishna Reddy: లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆత్మహత్య యత్నం..!
- Hyderabad: హైదరాబాద్‌లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
- Missing Girls: హైదరాబాద్‌లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
తాజావార్తలు
-
Lenin : అఖిల్ బాక్సాఫీస్ ఊచకోత.. 10 రోజుల్లో ‘లెనిన్’ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
-
Yash: రాకింగ్ స్టార్ యష్‌తో ప్రశాంత్ వర్మ సినిమా? మామూలుగా ఉండదట!
-
Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
-
Silk Smitha: నాకు ఒకడు జీవితం ఇస్తానన్నాడు.. రోజూ టార్చర్ నేను భరించలేను.. సిల్క్ స్మిత సూసైడ్ నోట్ చూశారా?
-
India First Dengue Vaccine: శుభవార్త.. భారత్‌లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్‌కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!