JBL స్పీకర్లు, Snapdragon 7s Gen ప్రాసెసర్ తో Infinix NOTE 60, NOTE 60 Pro లాంచ్.. ఫీచర్స్ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Infinix NOTE 60, NOTE 60 Pro Launch: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) నుండి నోట్ సిరీస్‌లో సరికొత్త స్మార్ట్ ఫోన్స్ ను ప్రపంచ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఇన్ఫినిక్స్ నోట్ 60 (Infinix Note 60), ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో (Infinix Note 60 Pro) పేరుతో వచ్చిన ఈ ఫోన్లు అద్భుతమైన డిస్ప్లే, భారీ బ్యాటరీ, అత్యాధునిక ప్రాసెసర్లతో వినియోగదారులను మాత్రమే కాకుండా.. టెక్ ప్రియులను కూడా ఆకట్టుకుంటున్నాయి.
3D కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే:
ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో ప్రధాన ఆకర్షణ వీటి డిస్ప్లేలు. ఇవి 6.78 అంగుళాల 1.5K (1208×2644 పిక్సెల్స్) 3D కర్వ్డ్ LTPS AMOLED డిస్ప్లేను కలిగి ఉన్నాయి. ఇవి 144Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 4500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తాయి. దీనితో ఇవి ఎండలో కూడా స్పష్టమైన విజువల్స్ అందిస్తాయి. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ని ఉపయోగించారు.
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
Pixel 10a India Launch: భారత్‌లో గూగుల్ ‘పిక్సెల్ 10ఏ’ విడుదల.. 5100mAh బ్యాటరీ, 48MP కెమెరా!
ప్రాసెసర్ & పెర్ఫార్మెన్స్:
ఇన్ఫినిక్స్ నోట్ 60 సిరీస్‌లో పెర్ఫార్మెన్స్ విషయంలో అసలు రాజీ పడలేదు. నోట్ 60 ప్రోలో తొలిసారిగా స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 చిప్‌సెట్‌ను వాడారు. ఇది గేమింగ్ అండ్ మల్టీ టాస్కింగ్ కోసం అత్యుత్తమ వేగాన్ని అందిస్తుంది. అలాగే నోట్ 60లో సాధారణ మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలాగే వీటిలో గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండటానికి 4758mm² 3D VC కూలింగ్ ఛాంబర్ టెక్నాలజీని ఇందులో ప్రవేశపెట్టారు.

భారీ బ్యాటరీ:
ఈ ఫోన్ల మరో ప్రత్యేకత వీటి బ్యాటరీ సామర్థ్యం. ఇన్ఫినిక్స్ చరిత్రలోనే అతిపెద్దదైన 6500mAh బ్యాటరీని ఈ ఫోన్లలో అందించారు. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ.. ఫోన్ కేవలం 7.36mm మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుంది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే.. ప్రో మోడల్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయగా, సాధారణ మోడల్ 45W ఛార్జింగ్‌తో వస్తుంది. ఇవి రెండూ 30W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తాయి. దాదాపు 2,000 సార్లు ఛార్జ్ చేసినా (సుమారు 6 ఏళ్లు) బ్యాటరీ సామర్థ్యం 80% కంటే తగ్గదని కంపెనీ పేర్కొంది.
T20 World Cup 2026: దూబే మెరుపులు.. నెదర్లాండ్స్‌పై టీమిండియా విజయం..
కెమెరా & సాఫ్ట్‌వేర్ ఫీచర్లు:
ఫోటోగ్రఫీ కోసం వెనుక వైపు 50MP ప్రధాన కెమెరా (OIS సపోర్ట్‌తో), 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 13MP ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత XOS 16 పై నడుస్తాయి. వీటికి 3 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, 5 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లు లభిస్తాయి.
ఇతర స్మార్ట్ ఫీచర్లు:
వన్-టాప్ బటన్: ఫోన్ కి ఒకవైపున ఉండే ఈ బటన్ ద్వారా హృదయ స్పందన రేటు (Heart Rate), ఆక్సిజన్ లెవల్స్ (SpO2) వంటి ఆరోగ్య వివరాలను తెలుసుకోవచ్చు.

యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లే (ప్రో మోడల్): నోట్ 60 ప్రో వెనుక భాగంలో ఒక డిస్ప్లే ఉంటుంది. ఇది నోటిఫికేషన్లు వచ్చినప్పుడు మాత్రమే వెలుగుతుంది.
డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్: IP64 రేటింగ్‌తో ధూళి, నీటి చినుకుల నుండి రక్షణ లభిస్తుంది.
JBL స్పీకర్లు: మెరుగైన ఆడియో అనుభవం కోసం జెబిఎల్ ట్యూన్ చేసిన స్టీరియో స్పీకర్లను అమర్చారు.
నోట్ 60 ప్రో మోడల్ డీప్ ఓషన్ బ్లూ, సోలార్ ఆరెంజ్ వంటి ఆరు రంగుల్లో లభిస్తుండగా.., నోట్ 60 మోడల్ రోజ్ గోల్డ్, ఫిజ్ బ్లూ వంటి ఐదు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి రానుంది. ధర, విక్రయాలకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!