బీజేపీ ఎంపీ ఇంటిపై బాంబుల దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ జనతా పార్టీ ఎంపీ అర్జున్ సింగ్ నివాసంపై దుండగులు బాంబులు విసరడంతో తీవ్ర కలకలం రేపింది.. పూర్తి వివారాల్లోకి వెళ్తే.. కోల్‌కతాలోని ఎంపీ అర్జున్ సింగ్ ఇంటి దగ్గర ఇవాళ ఉదయం బైక్‌పై వచ్చిన కొందరు దుండగులు బాంబులు విసిరారు.. మొత్తం మూడు బాంబులు ఇంట్లోకి విసిరే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుండగా.. అవి ఇంటి గేటు దగ్గర పేలాయి.. ఈ ఘటనలో ఇంటి గేటు ధ్వంసం అయ్యింది. ఇక, ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు.. అయితే, ఈ దాడి జరిగినప్పుడు.. సదరు ఎంపీ ఇంట్లో లేరు.. ఆయన ఢిల్లీలో ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఇక, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు..
ఢిల్లీలో ఉన్న ఎంపీ అర్జున్ సింగ్.. ఇవాళ కోల్‌కతాకు రానున్నట్టుగా తెలుస్తోంది… ఇక, ఈ ఘటనపై తీవ్రంగా మండిపడుతోంది బీజేపీ.. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులే ఈ దాడికి పాల్పడి ఉంటారని ఆరోపిస్తున్నారు బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్.. కాగా, బీజేపీ ఆరోపణలను తోసిపుచ్చింది టీఎంసీ.. బీజేపీలో ఉన్న అంతర్గత వ్యవహారాలతోనే బాంబు దాడులు జరిగిఉంటాయని వ్యాఖ్యానించింది. మరో వైపు.. ఈ ఘటనపై బెంగాల్ గవర్నర్ ట్వీట్ చేశారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి టీఎంసీ, బీజేపీ నేతల మాటల యుద్ధమే కాదు.. దాడులు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి.. ఎన్నికల సమయంలో.. కొన్ని ప్రాంతాల్లో హింస చెలరేగింది.. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా పలు దాడులు, ప్రతి దాడులు జరుగుతూనే వచ్చాయి. తాజాగా, ఎంపీ నివాసం ఇంటి ముందే బాంబు పేలుళ్లు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్‌కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!