వైఎస్ సంస్మరణ సభకు వెళ్లిన బీజేపీ నేతలను పార్టీ ఎందుకు ప్రశ్నించలేదు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్‌ఆర్ సంస్మరణ సభకు వెళ్లిన కాంగ్రెస్ నేతలపై ఆ పార్టీలో చర్చ.. రచ్చ జరుగుతోంది. సభకు హాజరైన బీజేపీ నేతలపై కాషాయ శిబిరంలో ఎలాంటి ఉలుకు.. పలుకు లేదు. కానీ.. సంస్మరణ సభకు వెళ్లినవారి తీరుపై మాత్రం ప్రైవేట్ సంభాషణల్లో గట్టిగానే చర్చ జరుగుతోంది. వాటిపైనే ఇప్పుడు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.
రాజకీయ భవిష్యత్ కోసం కర్చీఫ్ వేశారా?
Also Read
హైదరాబాద్‌లో వైఎస్‌ఆర్ సంస్మరణ సభ ముగిసినా.. ఆ కార్యక్రమానికి వెళ్లిన వివిధ పార్టీల నేతలపై చర్చ మాత్రం ఆగడం లేదు. షర్మిల పార్టీ కోసమే సభ పెట్టారన్నది రాజకీయ పక్షాల అనుమానం. అందుకే కాంగ్రెస్ దూరంగా ఉంటే.. బీజేపీ చప్పుడు చేయలేదు. కానీ.. బీజేపీలో ఉంటూ.. కీలక బాధ్యతలు నిర్వహిస్తూ కూడా సంస్మరణ సభకు వెళ్లారు కొందరు కమలనాథులు. వారిపైనే ఇప్పుడు చర్చ మొదలైంది. రాజకీయ భవిష్యత్ కోసం.. ఆ కొందరు ముందు జాగ్రత్త పడ్డారనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్‌ఆర్ సంస్మరణ సభకు వెళ్లినా బీజేపీ పట్టించుకోలేదు!
బీజేపీ నేతలు, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక్‌రెడ్డి వైఎస్‌ఆర్ సంస్మరణ సభకు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై జరిగినంత చర్చ బీజేపీలో వీళ్లపై జరగకపోయినా.. ఎందుకు వెళ్లారు అన్నదే ప్రశ్న. దీనిపై వారిని బీజేపీ పెద్దలు అడిగింది లేదు. వివరణ కోరిందీ లేదు. పైగా సభకు అంతగా రాజకీయ ప్రాధాన్యం లేదని చెబుతున్నారు. ఆ మీటింగ్‌కు వెళ్లిన వారంతా మరుసటి రోజు నుంచే బీజేపీ కార్యక్రమాల్లో మునిగిపోయారు. శ్రీశైలంగౌడ్.. సంగ్రామయాత్రలో తళుక్కుమంటే.. హుజురాబాద్ ప్రచారంలో కనిపించారు జితేందర్‌రెడ్డి.
బీజేపీ నేతల్లో కొత్త పోకడలేంటని కాషాయ దళంలో ప్రశ్నలు!
సీఎం కేసీఆర్ దళితుల అంశంపై అఖిలపక్ష మీటింగ్ పెడితే.. బీజేపీ నుంచి ఎవరూ వెళ్లకూడదని అనుకున్నా.. అప్పటికి బీజేపీలో ఉన్న మోత్కుపల్లి గీత దాటారు. దీనిపై బీజేపీలో చర్చ జరిగింది. ఇంతలో మోత్కుపల్లి బీజేపీని వదిలి వెళ్లిపోయారు. వైఎస్‌ఆర్ సంస్మరణ సభపై మాత్రం బీజేపీలో అలాంటి వాతావరణం కనిపించలేదు. రాజకీయ పార్టీ పరంగా షర్మిల పార్టీని బీజేపీ వ్యతిరేకిస్తోంది. సంస్మరణ సభ షర్మిల పార్టీకి లబ్ధి చేకూర్చడానికి పెట్టిందే అన్నది కమలనాథుల అనుమానం. అయినప్పటికీ ఎక్కడా ఓపెన్ కాలేదు. ఆ సంస్మరణ సభకు బీజేపీ నేతలు వెళ్లినా అభ్యంతరం చెప్పలేదు.. ప్రశ్నించలేదు. దీంతో బీజేపీకి ఏమైంది అని పార్టీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయట. బీజేపీలో ఈ కొత్త పోకడలేంటని అంతర్గత సంభాషణల్లో నిలదీస్తున్నారట. పార్టీకి ఒక లైన్ అనేది లేకపోతే రానున్న రోజుల్లో ఇలాంటి పరిణామాలు కొత్త పుంతలు తొక్కుతాయని ఆందోళన చెందుతున్నారట.
తాజావార్తలు
-
Share Nani Tag: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Bloody Romeo : నాని సరసన నాజూకు బ్యూటీ..
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!