ఆయన ఆ పార్టీకి అధ్యక్షుడై ఏడాదే అయ్యింది. అప్పుడే ఆయన వెనక గోతులు తవ్వుతున్నారా? ఆ గోతుల వెనక ఒకనాటి మిత్రపక్షం ఉందని అనుమానిస్తున్నారా? పార్టీ వర్గాలు ఏమనుకుంటున్నాయి? ఏంటా పార్టీ? ఎవరా నాయకుడు? సోమును తొలగించి కన్నాకు పగ్గాలు ఇస్తారని ప్రచారం! సోము వీర్రాజు. ఏపీ బీజేపీకి అధ్యక్షుడై ఏడాది అయ్యింది. ఈ సంవత్సర కాలంలో ఆలయాలపై దాడులు.. అంతర్వేది, దుర్గగుడి రథాలపై ఉద్యమాలు చేశారు. మధ్యలో తిరుపతి లోక్సభ ఉపఎన్నికనూ ఎదుర్కొన్నారు. కోవిడ్ వల్ల…
కన్నడ రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరూ చెప్పలేరు. కాంగ్రెస్-జేడిఎస్ పార్టీలు కలిసి గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సంవత్సరం తిరగక ముందే ఆ ప్రభుత్వం కూలిపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేసీ సీనియర్ నేత యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా రెండేళ్లు పరిపాలన సాగించారు. వయసు రిత్యా ఆయన పదవి నుంచి తప్పుకొవడంతో బొమ్మైని ముఖ్యమంత్రి పదవి లభించింది. పాత మంత్రి వర్గాన్ని కొనసాగించకుండా తనదైన ముద్ర వేసుకోవడానికి మంత్రి వర్గాన్ని ముఖ్యమంత్రి బొమ్మై ప్రక్షాళన చేశారు. 18…
హుజురాబాద్ లో పద్మశాలి సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… మాజీ మంత్రి ఈటలను ఎన్ని సార్లు పద్మశాలి భవనం అడిగిన ఇవ్వని మాజీ మంత్రి. ఈ రోజు పద్మ శాలీలకు ఒక ఎకరం భూమి కోటి రూపాయలతో భవన నిర్మాణం పత్రాలు ఇప్పించిన ఘనత కేసీఆర్. ఈ భూమిని రెండు రోజుల్లో నిర్మించుకొనుటకు టెండర్లు పిలిచి త్వరలో భవన నిర్మాణం చేపడుతం. ఉద్యమాల్లో జోలె పట్టి కేసీఆర్ ను ఆదుకున్న ఘనత పద్మశాలీలది అన్నారు. ఈ…
కాంగ్రెస్ ,బీజేపీ చీకటి ఒప్పందం లో భాగంగా ఇంద్రవెల్లి సభ జరిగింది. ఆ రెండు పార్టీ లకు ప్రజలు బుద్ది చెప్పే రోజు ఎంతో దూరం లో లేదు అని మాజీ మంత్రి ,ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పగటి దొంగ రేవంత్ కు తగిన శాస్తి లభిస్తుంది. దళిత ,గిరిజనులకు కాంగ్రెస్ చేసిందేమి లేదు. నాగోబా జాతరకు నిధులిచ్చి ఘనంగా నిర్వహిస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని తెలిపారు. గతం లో గిరిజన ,ఆదివాసీ పండగలను సంస్కృతిని…
ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి, పొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మధ్య ప్రమాణాల వివాదం కొనసాగుతుంది. ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు వివాదంపై బీజేపీ వైసీపీ ల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. తనపై రాచమల్లు చేసిన అవినీతి ఆరోపణలు నిరాధారమైనవంటూ కాణిపాకం ఆలయంలో సత్య ప్రమాణానికి సిద్ధమయ్యారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. ఈ సత్య ప్రమాణానికి ఎమ్మెల్యే రాచమల్లు ముందుకురావాలని…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. పెగాసెస్, రైతు చట్టాలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. వీటిపై అధికారపక్షం కూడా పట్టుబడుతుండటంతో.. పార్లమెంట్ సమావేశాల్లో ఎలాంటి చర్చలు జరగడంలేదు. అయితే తొలిసారి అధికార, విపక్షాలు.. ఒక్క తాటిపైకి వచ్చాయి. ఓబీసీ జాబితాని నిర్వహించే అధికారాన్ని రాష్ట్రాలకే కట్టబెట్టే బిల్లుపై అధికార, విపక్షాలు ఒకేమాటపై నిలుస్తున్నాయి. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు ప్రతిపాదించకుండానే తమ రాష్ట్రాల్లోని ఓబీసీ, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి…
బీజేపీ ఆడిస్తున్న నాటకంలో ఒక భాగం ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. లాభం జరిగే దళిత వర్గాలకు నష్టం కలిగే కుట్ర బీజేపీ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళను వాడుకొని చేస్తోంది. కేవలం రాజకీయ విమర్శల కోసం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు అని తెలిపారు. ఆ తర్వాత ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ… ప్రవీణ్ కుమార్ కలలు కలగానే మిగిలిపోతుంది. ప్రవీణ్ కుమార్ ఆయన ఎజెండా చెప్పాలి!. అర్థం…
కరీంనగర్ జిల్లా.. జమ్మికుంట పట్టణంలోని ఎంపిఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ… దేశానికి దిక్సూచి దళిత బంధు పథకం. గత ప్రభుత్వాలు దళితులను కేవలం ఓటు బ్యాంక్ కోసం మాత్రమే చూశారు. దళితుల దారిద్రయాన్ని పోగెట్టెందుకు ఏ ప్రభుత్వం కృషి చేయలేదు. ఒక దళిత కుటుంబానికి నేరుగా రూ.10లక్షలు ఖాతాలో వేయడం సంతోషకరమైన విషయం అన్నారు. రూ.500కోట్లు కేవలం మొదటి వీడుత మాత్రమే. రాష్ట్ర…
కరోనా మహమ్మారి ఏ దేశాన్ని రాష్ట్రాన్ని వదలిపెట్టడం లేదు.. కాస్త అజాగ్రత్తగా ఉన్న ఏ వ్యక్తిని కూడా వదలకుండా పనిపట్టేస్తోంది… అయితే, ఆ మహమ్మారి ఏమీ చేయలేదు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్.. బీజేపీ కార్యకర్తలకు కరోనా వాలంటీర్లుగా పనిచేసేందుకు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.. ఈ కార్యకరమానికి హాజరైన ఆయన.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా శివుడు, పార్టీ చీఫ్గా విష్ణువు ఉండగా ఇక మధ్యప్రదేశ్ను మహమ్మారి ఏం చేస్తుంది?…