బీజేపీకి ఓటు వేస్తే లాభం జరుగుతుందా.. టీఆర్ఎస్ కి ఓటు వేస్తే లాభం జరుగుతుందా ఆలోచించాలి అని ప్రజల్ని ఆర్థిక మంత్రి హరీశ్ రావు కోరారు. పని చేసిన వాళ్ళు ఎవరూ.. చేయగలిగేవారు ఎవరు ఆలోచించాలి. కళ్యాణలక్ష్మీని కొంతమంది పరిగెరుకున్నట్లు అని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి త్వరలోనే పెన్షన్ అందుతుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలను అమాంతం పెంచుతోంది. దొడ్డు వడ్లు కొనమని కేంద్రం చెబుతోంది. వీణవంకలో ఓట్లు అడిగే ముందు…
టీఆర్ఎస్, బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. బండి మీద కారు ప్రయాణిస్తోందంటూ కామెంట్ చేసిన ఆయన.. బీజేపీ, టీఆర్ఎస్ కు అవగాహన ఉందన్నారు.. తెలంగాణ విమోచన దినోత్సవం జరపటం ఇద్దరకీ ఇష్టం లేదని.. ఈ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ కు నార్కోటిక్ టెస్ట్ చేయాలని వ్యాఖ్యానించారు. ఇక, తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవానికి బీజేపీ మతం రంగు పులుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు నారాయణ.. విమోచన దినోత్సవం గురించి మాట్లాడే అర్హత కమ్యూనిస్టులకు మాత్రమే…
ఇన్నాళ్లు దేశంలో మోడీకి ఎదురేలేదు. కానీ కరోనా వచ్చాక పరిస్థితులు మారాయి. ప్రతిపక్షం కాంగ్రెస్ కుదేలైనా.. మోడీ పక్షాన్ని మాత్రం కరోనా చావుదెబ్బ తీసింది. కరోనా టైంలో ప్రజలను ఆదుకునే విషయంలో.. ప్యాకేజీలు ప్రకటించడంలో మోడీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. కరోనా ఎఫెక్ట్ తో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం.. కవర్ చేయడానికి మోడీ సార్ పెంచిన ధరాఘాతంతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. ఈక్రమంలోనే ఎన్నడూ లేనంతగా మోడీ పాలనపై దేశ ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతుందని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఈ…
రాజకీయాల్లో ఎమర్జ్ అయ్యే నేతలు కొందరు.. ప్రజలపై స్పష్టమైన ప్రభావాన్ని కలిగిస్తూ ఉంటారు. భవిష్యత్ పై క్లియర్ అజెండాతో ముందుకు వెళ్తుంటారు. ఇప్పుడు తెలంగాణలో.. 3 ప్రధాన పార్టీల్లో.. ముగ్గురు యువనేతలు ఇలాగే రాజకీయాలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్నారు. రాబోయే తరానికి కాబోయే రాజకీయ సారథులం మేమే అన్నట్టుగా వారు తమ తమ పార్టీల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అందులో టీఆర్ఎస్ ను గమనిస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడిగా.. మంత్రిగా గుర్తింపు తెచ్చుకుని.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి…
తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంటోంది. టీఆర్ఎస్ నేతలంతా హుజూరాబాద్ పై దృష్టి పెట్టగా.. కాంగ్రెస్, బీజేపీ నేతలు సైతం తమ తమ రాజకీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా ముందుకు పోతున్నాయి. ఈ క్రమంలో.. బీజేపీ నేతలు ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా.. పార్టీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను రాష్ట్రానికి రప్పిస్తున్నారు. ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం.. ఆయన రాక ఖరారైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాసిన…
భారతీయ జనతా పార్టీ ఎంపీ అర్జున్ సింగ్ నివాసంపై దుండగులు బాంబులు విసరడంతో తీవ్ర కలకలం రేపింది.. పూర్తి వివారాల్లోకి వెళ్తే.. కోల్కతాలోని ఎంపీ అర్జున్ సింగ్ ఇంటి దగ్గర ఇవాళ ఉదయం బైక్పై వచ్చిన కొందరు దుండగులు బాంబులు విసిరారు.. మొత్తం మూడు బాంబులు ఇంట్లోకి విసిరే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుండగా.. అవి ఇంటి గేటు దగ్గర పేలాయి.. ఈ ఘటనలో ఇంటి గేటు ధ్వంసం అయ్యింది. ఇక, ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో.. అంతా…
వైఎస్ఆర్ సంస్మరణ సభకు వెళ్లిన కాంగ్రెస్ నేతలపై ఆ పార్టీలో చర్చ.. రచ్చ జరుగుతోంది. సభకు హాజరైన బీజేపీ నేతలపై కాషాయ శిబిరంలో ఎలాంటి ఉలుకు.. పలుకు లేదు. కానీ.. సంస్మరణ సభకు వెళ్లినవారి తీరుపై మాత్రం ప్రైవేట్ సంభాషణల్లో గట్టిగానే చర్చ జరుగుతోంది. వాటిపైనే ఇప్పుడు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. రాజకీయ భవిష్యత్ కోసం కర్చీఫ్ వేశారా? హైదరాబాద్లో వైఎస్ఆర్ సంస్మరణ సభ ముగిసినా.. ఆ కార్యక్రమానికి వెళ్లిన వివిధ పార్టీల నేతలపై చర్చ మాత్రం ఆగడం…
తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది.. ఇప్పటికే 100 కిలోమీటర్ల మైలురాయిని దాటేసింది.. ఇక, సంజయ్ పాదయాత్రలో కేంద్రమంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ సీఎంలు.. ఇలా రోజుకో నేత పాల్గొంటున్నారు. ఇవాళ బీజేవైఎం నేషనల్ ప్రెసిడెంట్ తేజస్వి సూర్య.. సంజయ్ పాదయాత్రలో కొద్దిసేపు తెలుగులోకి మాట్లాడారు తేజస్వి సూర్య.. బండి సంజయ్ చేసేది పాదయాత్ర కాదు కేసీఆర్ మీద చేసే దండ యాత్ర అన్న ఆయన.. తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్…
బీజేపీ గట్టిగా ఊదితే కొట్టకపోయే పార్టీ తెరాసా మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇంత దాదా గిరి చేస్తున్న నీకే ఇంత ఉంటే మాకు ఎంత ఉండాలి. మాకు సహనం ఉంది మౌనంగా చూస్తున్నాం. ఎన్ని తప్పులు చేస్తున్నావో లెక్క వేసి పెట్టుకుంటున్నాము. సందర్భం వచ్చినప్పుడు నీ భరతం పడతాం. కేసీఆర్ కాదు కదా ఆయన జేజెమ్మ దిగివచ్చినా హుజురాబాద్ లో గెలవలేరు అని తెలిపారు. ఛాలెంజ్ చేస్తున్న తాగుడు ఆపి, కొనుగోళ్లు ఆపి ప్రజాస్వామ్య…
ఉభయ తెలుగు రాష్ట్రాల నేతలు హస్తిన బాట పట్టారు.. త్వరలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు.. ఈలోపే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు.. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానం మేరకు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఇవాళ ఢిల్లీ చేరుకున్నారు.. మొదట ప్రహ్లాద్ జోషితో సమావేశంకానున్న ఆయన.. ఆ తర్వాత తన పర్యటనలో పలువురు బీజేపీ ముఖ్యనేతలతో భేటీ అవుతారని తెలుస్తోంది.…