హరీష్ రావ్ హుజూరాబాద్ లో అడ్డా పెట్టి అబద్దాల కారు కూతలు కూస్తున్నారు అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. డ్రామా కంపెనీ లాగా మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టి యాక్షన్ చేస్తున్నాడు. ప్రతి మాటలో వ్యంగ్యం, అబద్దం, ఇతరుల ఆత్మ గౌరవాన్ని కించపరిచే పద్దతి ఆపకపోతే నీ చరిత్ర ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది హరీష్ నీకు సవాలు చేస్తున్న.. అభివృద్ది జరగలేదు.. డబుల్ బెడ్ రూమ్ కట్టలేదు అని తెలిపారు. కుంకుమ భరిణలు పంపించి…
రేవంత్ రెడ్డి పీసీసీ, బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కావడానికి కారణం సీఎం కేసీఆర్ మాత్రమే. గులాబీ జెండా పుణ్యమే మీకు అధ్యక్ష పదవులు వచ్చాయని మంత్రి హరీష్ రావు అన్నారు. కాబట్టి మీరు చేయాల్సింది పాదయాత్రలు కాదు… పెంచిన గ్యాస్ , డీజిల్ ధరల పై ఢిల్లీ యాత్రలు చేయాలి. టీఆర్ఎస్ పార్టీ జల దృశ్యంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీ దాకా పోయింది. రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అభివృధి లో ఇతర రాష్ట్రాలకు…
తెలంగాణ మున్నూరు కాపు సంఘం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామయాత్రకు సంపూర్ణ మద్దతు తెలిపింది. సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుక్క వేణుగోపాల్ ఆధ్వర్యంలో సంజయ్ ను కలిశారు మున్నూరుకాపు నేతలు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… రాష్ట్ర మున్నూరు కాపు సంఘం బీజేపీ యాత్రకు మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉంది. టీఆర్ఎస్ దుర్మార్గ పాలన పోవాలని రాష్ట్రంలోని అన్ని కుల సంఘాల నాయకులు కుల సంఘాల ప్రజలు రాజకీయాలకతీతంగా…
ఢిల్లీ : కేంద్ర విద్యా, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అటవీ పర్యావరణ, కార్మిక శాఖల మంత్రి భూపేంద్ర యాదవ్ లను తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కలిశారు. రాష్ట్ర కార్మిక మంత్రిత్వ శాఖ కు స్కిల్ డెవలప్ మెంట్ కింద కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు విజ్ఞప్తి చేశారు మంత్రి మల్లారెడ్డి. నాచారంలో ఉన్న 350 బెడ్ల ఈఎస్ఐ హాస్పటల్ నిర్మాణం త్వరగా…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి జగ్గారెడ్డి సవాల్ విసిరారు. హిందువుల కోసం తాను చెప్పిన 4 అంశాల పై చర్చకు సిద్ధమా…? అని ప్రశ్నించారు. హిందువుల కోసం మోడీతో మాట్లాడి పెట్రోల్, డీజీల్ గ్యాస్ ధరలు తగ్గించగలవా ? తెలంగాణ లో ఉన్న పేద హిందువులకు రూ. 15 లక్షలు మోడీ తో ఇప్పించగలవా ? అని సవాల్ విసిరారు జగ్గారెడ్డి. తెలంగాణ లో ఉన్న 80 శాతం హిందువులకోసం మాట మీద నిలపడుతావా…
బండి సంజయ్ మతాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ పాదయాత్ర లో బిజెపి సీఎంలు ఏం చేస్తున్నారో చెప్పాలి. సంజయ్ యాత్రలో ప్రజలు ఎక్కడా లేరు… బీజేపీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారు అని తెలిపారు. ఇక 111 జీవో వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది… అది రాష్ట్రంకు సంబంధించిన విషయం కాదు. జితేందర్ రెడ్డితో పాటు మరికొంత మంది బీజేపీ నేతలకు 111 జీవో పరిధిలో…
పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, తన సోదరుడు డి. సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్.. బాన్సువాడ, బోధన్ నియోజకవరర్గాల నుంచి పలువురు నేతలు బీజేపీలో చేరారు.. పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించిన అరవింద్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేవంత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. సెప్టిక్ ట్యాంక్ లకు నేను దూరంగా ఉంటానని వ్యాఖ్యానించారు.. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు దిక్కులేరు. .డబ్బులిచ్చి కార్యక్రమాలకు రప్పిస్తున్నారు అని ఆరోపించిన ఆయన.. రేవంత్రెడ్డి తన కోపాన్ని…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మత తత్వ విద్వేషాలు పక్క రగిలిస్తామని… 80 శాతం ఉన్న హిందువులకు బీజేపీ అండగా ఉంటుందని బండి సంజయ్ అన్నారు. బీజేపీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదని తెలిపారు. రెచ్చగొట్టడం ఇంకా మేము మొదలు పెట్టలేదని… ఎంఐఎం అడ్డాను బద్దలు కొట్టి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర సభ పెట్టామని తెలిపారు. ఛాలెంజ్ ఎస్తే ఆ గల్లీ లోకి వచ్చి కాషాయ జండా ఎగురవేస్తామన్నారు.…
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ… ఉప ఎన్నికలు ఎక్కడ జరిగిన టీఆరెఎస్ అబద్ధపు జీవోలు విడుదల చేస్తున్నారు. ఆ జీవోలు ఎక్కడ అమలు కావు ఆన్లైన్ లో ఉండవు. దేశం లో అవినీతి లో మొదటి స్థానం ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని అన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ గెలిచిన తరువాత ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుండి బయటికి వస్తున్నాడు. ఈటల రాజేందర్ రాజీనామా తో సీఎంఓ అఫీస్ లో…