పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జోడు గుర్రాలపై స్వారీ చేస్తున్నారు. అటూ రాజకీయాల్లో, ఇటూ సినిమాల్లోనూ బీజీగా కొనసాగుతున్నారు. రాజకీయాలు పవన్ కల్యాణ్ కు కొత్తమే కాదు. ప్రజారాజ్యం పార్టీ పుట్టినప్పుడు పవన్ లో రాజకీయ నాయకుడు పుట్టారు. నాడు ఆ పార్టీ ఆశించిన సీట్లు సాధించకపోవడంతో ప్రజారాజ్యం కాంగ్రెస్ లో కలిసిపోయింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ సొంతంగా జనసేన పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లిన సంగతి అందరికీ తెల్సిందే. 2014లో పవన్ కల్యాణ్ పార్టీనైతే…
ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల టైం సమీపిస్తున్న కొద్ది అక్కడ ఎన్నికల వేడి రాజుకుంటోంది. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా అసెంబ్లీ, ఎంపీ స్థానాలు ఉన్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ అధికంగా ఎంపీ సీట్లను కైవసం చేసుకొని కేంద్రంలో ఈజీగా వరుసగా బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. త్వరలోనే యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న యోగీ సర్కారును దెబ్బకొట్టేలా ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.…
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు.. ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన నిర్మల్‌కు వచ్చేయనున్నారు.. తెలంగాణ విమోచన సభను నిర్మల్ లో నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.. అయితే, 17వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ పడనుంది.. ఇప్పటికే సంజయ్ పాదయాత్ర 100 కిలోమీటర్ల మైలు రాయిని దాటేసింది.. అయితే, 17వ తేదీన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర…
వినాయక చవితి పండగ దగ్గరికొస్తోంది. ఈ తరుణంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు.. రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలకు దారి తీస్తున్నాయి. వేడుకలను ఇళ్లల్లోనే జరుపుకోవాలని.. కోవిడ్ కారణంగా ఎక్కువగా జనాలు గుమికూడవద్దని ప్రభుత్వం చెబుతోంది. అందుకే.. ఈ ఆదేశాలు ఇచ్చినట్టు వెల్లడించింది. ఇదే.. బీజేపీ, టీడీపీ నేతల ఆగ్రహానికి కారణమైంది. ఇతర కార్యక్రమాలకు అడ్డు రాని కరోనా.. ఇప్పుడు వినాయక చవితి పండగకే అడ్డు పడుతోందా.. అన్న చర్చ మొదలైంది. ప్రతిపక్ష టీడీపీ అధినేత, మాజీ…
ఆంధ్రప్రదేశ్ లో రహదారుల చుట్టూ రాజకీయం ముసురుకుంటోంది. దెబ్బతిన్న రహదారులపై.. విపక్షాలు సమరభేరి మోగిస్తుంటే.. అధికార పక్షం సైతం దీటుగా స్పందిస్తూ.. టగ్ ఆఫ్ వార్ గా ముందుకు వెళ్తోంది. అవసరమైతే అప్పులు సైతం తీసుకునైనా రోడ్లు బాగు చేస్తామని ప్రభుత్వం నుంచి స్పందన వస్తుంటే.. ఇటు టీడీపీ, జనసేన నేతలు ఈ అంశాన్ని జనంలోకి తీసుకువెళ్లేందుకు యత్నిస్తున్నాయి.ఇప్పటికే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ విషయమై మాట్లాడారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ఉధృతంగా ప్రచారంలోకి…
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్… నిన్న ఇద్దరు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశమైన ఆయన… కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని, సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని చెప్పారు. KRMB, GRMBల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు సమయం కావాలని… అప్పటి వరకు రెండు బోర్డులకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఆరు రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్… వరుసగా కేంద్రమంత్రుల్ని కలుస్తున్నారు. నిన్న…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. హస్తినలో బిజీ బిజీగా గడుపుతున్నారు.. ఈ నెల 1వ తేదీన ఢిల్లీ వెళ్లిన ఆయన.. మరుసటి రోజు టీఆర్ఎస్ కార్యాలయానికి శంకుస్థాపనలో పాల్గొన్నారు.. ఇక, మరుసటి రోజు.. ప్రధాని మోడీని, ఆ తర్వాత అమిత్‌షాను.. ఇవాళ కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, గజేంద్ర షెకావత్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలపై కేంద్రమంత్రులతో చర్చించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. రేపు కూడా హస్తినలోనే ఉండనున్నారు సీఎం కేసీఆర్.. ఇప్పటికే ఆరు…
హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు.. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయనతో చర్చించారు. తెలంగాణలోని కల్వకుర్తి నుంచి కొల్హాపూర్, సోమశిల, కరువేన గుండా ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యా వరకు (ఎన్.హెచ్ 167 కే. జాతీయ రహదారి నిర్మాణానికి నోటిఫికేషన్ జారీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన కేసీఆర్.. ఈ జాతీయ రహదారి వల్ల తెలంగాణలోని కల్వకుర్తి, కొల్హాపూర్, సోమశిల, ఆంధ్ర ప్రదేశ్ లోని ఆత్మకూరు లాంటి వెనుక…
మంత్రి హరీష్‌రావు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్… జగిత్యాల జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీని నమ్ముకొని ఈటల రాజేందర్ మోసపోయారని గమనించాలని సూచించారు.. ఇక, రబ్బరు చెప్పులు కూడా లేని హరీష్ రావుకు వందల కోట్ల ఫామ్‌హౌస్‌లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మరోవైపు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో దొంగ నోట్లు పంచిన కేసు ఉండే అని కామెంట్ చేసిన…