ఢిల్లీ : కేంద్ర హోమంత్రి అమిత్ షాతో తెలంగాణ సీఎం కేసీఆర్ కాసేపటి క్రితమే భేటీ అయ్యారు. కేంద్ర హో మంత్రి అమిత్ షా నివాసంలో ఈ సమావేశం జరిగింది. విభజన చట్టం హామీల అమలు, ఐపీఎస్ అధికారుల సంఖ్య ని 195 కు పెంచాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కోరనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం కేంద్ర నిధులు సమకూర్చాలని విజ్ఞప్తి చేయనున్నారు సీఎం కేసీఆర్. ఐపీఎస్ కేడర్ పోస్టుల కేటాయింపులు…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు కొత్త సవాళ్లు ఎదురు కాబోతున్నాయా? సంగ్రామ యాత్రలో చివరి వరకు అదే ఊపు ఉంటుందా? కమలనాథులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? వారి ముందు ఉన్న ప్రశ్నలేంటి? సంగ్రామ యాత్రపై బీజేపీ వర్గాల్లో టెన్షన్! సంగ్రామ యాత్ర పేరుతో రోడ్డక్కారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఈ యాత్రపై పార్టీ నేతలు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఢిల్లీ నాయకత్వం కూడా ఎన్నో లెక్కలు వేసుకుంటోంది. కేడర్ను ఉత్సాహ పర్చేందుకు ఆరంభ…
నిరంతరం ప్రజల కోసం పని చేసే సీఎం కేసీఆర్కు.. ఉప ఎన్నికల్లో హుజురాబాద్ గెలుపును కానుకగా ఇద్దాం… మీ అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటానని అన్నారు ఆర్థిక మంత్రి హరీష్రావు.. హుజురాబాద్ నియోజకవర్గంలోని సింగాపూర్ దేశాయిపల్లిలో మంత్రి హరీష్రావు సమక్షంలో పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు గ్రామస్తులు.. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండేలా పని చేస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులను…
కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర కూటమి కోసం ఎప్పటి నుంచి ప్రయత్నాలు సాగుతున్నాయి.. మరోవైపు.. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాలనే ఆలోచనలు కూడా చేస్తున్నారు.. అయితే, థర్డ్ ఫ్రంట్, కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మాజీ ప్రధాని దేవెగౌడ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటి పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ యేతర ప్రభుత్వం రావడం కష్టమన్నారు.. మొదట అన్ని ప్రాంతీయ పార్టీలు ఒక్క వేదిక పైకి రావాలన్నారు.. ప్రాంతీయ పార్టీలు ఆయా…
బీజేపీ నాయకులు.. తెలంగాణలో అందివచ్చిన వేవ్ ను కొనసాగించేందుకు అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలనూ చేస్తున్నట్టే కనిపిస్తోంది. దుబ్బాకలో గెలుపు ఇచ్చిన కిక్ తో పాటు.. గ్రేటర్ హైదరాబాద్ లో అందిన అనూహ్య విజయం ఆ పార్టీలో మరింత జోష్ నింపింది. ఇది కొనసాగించడంతో పాటు.. రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ అడుగులకు బ్రేక్ వేయాలన్న లక్ష్యంతో.. బండి సంజయ్ విస్తృతంగా పాదయాత్ర చేస్తున్నారు. ఇదే క్రమంలో అధికార పార్టీపైనా విమర్శల దాడి చేస్తున్నారు. ఈ వేడిని మరింత…
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత దిలీప్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దుర్గామాత ను తాము గౌరవిస్తామని, దుర్గామాత బెంగాల్కు గౌరవమని, అయితే సెక్యులర్ అని చెప్పుకునే కొందరు బెంగాల్ ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని పరోక్షంగా విమర్శిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీని పోలి ఉన్న దుర్గామాత విగ్రహాన్ని కొందరు ఏర్పాటు చేయడంపై ఆయన ఈ విమర్శలు చేశారు. ఇలాంటి చర్యలు బెంగాల్ ప్రజల…
ప్రధాని నరేంద్ర మోడీ తెస్తానన్న అచ్చే దిన్ అంటే ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం, తాకట్టు పెట్టడమేనా? అని ప్రశ్నించారు రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మల్లికార్జున ఖర్గే.. హైదరాబాద్ వచ్చిన ఆయన.. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోందని విమర్శించారు. నేడు ప్రభుత్వ రంగ సంస్థల్లో 35 లక్షల మంది పనిచేస్తున్నారని.. కానీ, మోడీ ఒక్కో రంగాన్ని ఖతం చేస్తున్నారని మండిపడ్డారు.. మరోవైపు రిజర్వేషన్లను సైతం…
ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షేకవత్ లతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ నేపథ్యం లోనే సీఎం కేసీఆర్ తన ఢిల్లీ పర్యటన ను మరో రెండు రోజుల పొడిగించుకున్నారు. గోదావరి, కృష్ణానదీ జలాల వ్యవహారం, కేంద్ర గెజిట్ పై ప్రధాని మోడీ మరియు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షేకవత్ లతో చర్చించనున్నారు సీఎం కేసీఆర్. అలాగే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల పై ప్రధాని…
ఎన్నికలంటేనే బోల్డంత ఖర్చు. పోలింగ్ తేదీ ఖరారైతే ఖర్చుకు ఒక లెక్క తెలుస్తుంది. హుజురాబాద్లో మాత్రం అంతా రివర్స్. ఉపఎన్నిక ఎప్పుడో తెలియదు. 2 నెలలుగా ప్రధాన పార్టీలు డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్నాయి. జేబులు ఖాళీ అవుతున్నాయి తప్ప ఎలక్షన్ ఎప్పుడో.. ఏంటో.. క్లారిటీ లేదు? ఇంకా ఎన్ని రోజులు.. ఎంత ఖర్చు పెట్టాలో తెలియక ఆందోళన చెందుతున్నారట నేతలు. వందల మందితో కలిసి ఎన్నికల ప్రచారం! హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు.…
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం లో జెండా పండుగ కార్యక్రమం లో పాల్గొన్న ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ… టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ భారీ మెజారితో గెలవడం ఖాయం. టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న ఈటల మాటలకు స్పందించారు ప్రభుత్వం బాల్క సుమన్. ఈటల రాజేందర్ శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకోవడానికి మానసికంగా ఇప్పటి నుండే సిద్ధం కావాలి. దమ్ముంటే కేసీఆర్, హరీష్ రావు నామీద పోటీ చేయాలనే స్థాయి…