ఈనెల 30 వ తేదీన పశ్చిమ బెంగాల్‌కు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. భవానీ పూర్ నియోజక వర్గానికి జరిగే ఉప ఎన్నికలపై అందరి దృష్టి నిలిచింది. ఈ ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీలోఉండగా, బీజేపీ నుంచి ప్రియాంక తిబ్రేవాల్ పోటీలో ఉన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజయం నల్లేరుపై నడకే అయినప్పటికీ నందిగ్రామ్ ఓటమి తరువాత మమతా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా బెంగాల్‌లో పెద్ద ఎత్తున హింసలు చెలరేగాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. ఉప ఎన్నికల కోసం 15 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని నిర్ణయం తీసుకుంది. ఈ బలగాలు ఉప ఎన్నికల సందర్భంగా భవానీపూర్‌లో పహారా కాస్తున్నాయి.