ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… అవసరం అయితే రాజద్రోహం కేసులు పెడతామని హెచ్చరించారు.. తెలంగాణ భవన్‌లో మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. మేం ప్రభుత్వoలో ఉన్నాం.. చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం.. కానీ, ప్రతిపక్షాలకు పని లేదు.. ఒకరు పాదయాత్ర చేస్తున్నారు.. ఒకరేమో నేనున్నాని చెప్పుకోవడానికి హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు.. ఇక, తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ, జన సంఘ్ ఉందా..? అని ప్రశ్నించారు కేటీఆర్.. చరిత్రకు మతం రంగు పూస్తున్నారని విమర్శించిన ఆయన.. ఢిల్లీ పార్టీలకు సిల్లి పాలిటిక్స్ మాత్రమే తెలుసు.. తెలంగాణ ప్రజలకు కావాల్సింది మాత్రం తెలియదు అంటూ సెటైర్లు వేశారు.
కొత్తగా తెలంగాణలో పుట్టుకొస్తున్న పార్టీలు.. జాతీయ పార్టీలకు కొమ్ము కాస్తున్నాయని ఆరోపించారు కేటీఆర్.. టీఆర్‌ఎస్ ఓట్లను చీల్చటం కోసం కొత్త పార్టీలు.. ఏదో ఒక జాతీయ పార్టీతో కొమ్ము కాస్తున్నాయన్న ఆయన.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో కేసీఆర్ ను పొగిడారని గుర్తుచేశారు.. రాష్ట్రానికి నవోదయ స్కూల్స్ రాకపోతే .. కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు.. ఇక, వైఎస్ షర్మిల పార్టీ కూడా అంతేనని వ్యాఖ్యానించారు. సీఎం సెక్రటేరియట్ కు వచ్చాడా, ఫామ్ హౌస్ లో ఉన్నాడా కాదు.. పనులు అవుతున్నాయా లేదా చూడండి అని సూచించారు కేటీఆర్.. ముఖ్యమంత్రిని పట్టుకొని తాగుబోతు అంటారా..? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. సున్నాలు వేసుకునే వాళ్లు.. కన్నాలు వేస్తున్నారు. వదిలి పెట్టం.. వాళ్ళ బాగోతం మొత్తం తెలుసు బయట పెడతాం అంటూ వార్నింగ్ ఇచ్చారు.. నోటికి వచ్చినట్టు వాగడం తప్ప వారికి ఏం తెలియన్న కేటీఆర్.. మంత్రి మల్లారెడ్డి సవాల్‌కు భయపడి పారిపోయాడు అంటూ ఎద్దేవా చేశారు.. కేసీఆర్ పుట్టినప్పుడే వందల ఏకరాలున్నాయన్న ఆయన.. బ్లాక్ మెయిల్ తో పైసలు సంపాదన.. పీసీసీ కొనుకున్నోడు, టికెట్లు అమ్ముకొనుడూ.. అన్ని ఆ పార్టీలో ఉన్నాయని రేవంత్‌పై సెటైర్లు వేశారు.
ఇక, తనను డ్రగ్స్ కు అంబాసిడర్ అని అంటారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.. నాకు డ్రగ్స్ కు సంబంధం ఏంటి..? అని ప్రశ్నించిన ఆయన.. నేను అన్ని డ్రగ్స్ అనాలసిస్ టెస్టులకు సిద్ధం.. రాహుల్ గాంధీ సిద్ధమా..? అని ప్రశ్నించారు.. ఎవడో పిచ్చోడు ఈడీకి లెటర్ ఇచ్చాడని మండిపడ్డ ఆయన.. హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ వచ్చేనా? అని ప్రశ్నించాడు. తెలంగాణ ప్రయోజనాలు, పురోగతి, గణాంకాల విషయంలో తప్పు దారి పట్టిస్తే.. రాజద్రోహం కేసులు పెడతామని హెచ్చరించారు.. జూన్ 2 తెలంగాణకు విమోచనదినం అని స్పష్టం చేశారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్ పక్కాగా గెలుస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. ఈటల రాజేందర్, జానారెడ్డి కన్నా పెద్దోడా..? అని ప్రశ్నించారు.. ప్రతిపక్షాలు ఒక్కటి మాట్లాడితే ఇకపై పది మాటలు అంటాం.. ఇంతకాలం ఓపిక పట్టాం.. ఇక, గుడ్డలు ఉడ తీస్తామని వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్.