పంజాబ్ కాంగ్రెస్ కొత్త ముఖ్యమంత్రిగా సుఖ్‌జిందర్ సింగ్ రణ్‌దవాను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన తరువాత సిద్ధూపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. సిద్దూకి, పాక్ పీఎం, ఆర్మీ చీఫ్‌కి మద్య మంచి సంబంధాలు ఉన్నాయని, పాక్ కు పంజాబ్ ఆయుధంగా మారుతుందేమో అనే భయం కలుగుతుందని, సిద్ధూ సీఎంగా ఎంపికైతే పంజాబ్‌లోకి పాక్ ఆయుధాలు వస్తాయని తద్వారా దేశంలో కలహాలు రేగే అవకాశం ఉందని అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. అమరీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటివరకు ఎందుకు స్పందించడం లేదని బీజేపీ జాతీయ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉంటే సరిపోదని, వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం ఉందని బీజేపీ నేత ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు.
Read: సరికొత్త ఆలోచన: ఇది రూఫ్ గార్డెన్ కాదు… టాక్సీ గార్డెన్….