ఆంధ్రప్రదేశ్ లో రహదారుల చుట్టూ రాజకీయం ముసురుకుంటోంది. దెబ్బతిన్న రహదారులపై.. విపక్షాలు సమరభేరి మోగిస్తుంటే.. అధికార పక్షం సైతం దీటుగా స్పందిస్తూ.. టగ్ ఆఫ్ వార్ గా ముందుకు వెళ్తోంది. అవసరమైతే అప్పులు సైతం తీసుకునైనా రోడ్లు బాగు చేస్తామని ప్రభుత్వం నుంచి స్పందన వస్తుంటే.. ఇటు టీడీపీ, జనసేన నేతలు ఈ అంశాన్ని జనంలోకి తీసుకువెళ్లేందుకు యత్నిస్తున్నాయి.ఇప్పటికే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ విషయమై మాట్లాడారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ఉధృతంగా ప్రచారంలోకి…
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్… నిన్న ఇద్దరు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశమైన ఆయన… కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని, సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని చెప్పారు. KRMB, GRMBల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు సమయం కావాలని… అప్పటి వరకు రెండు బోర్డులకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఆరు రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్… వరుసగా కేంద్రమంత్రుల్ని కలుస్తున్నారు. నిన్న…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. హస్తినలో బిజీ బిజీగా గడుపుతున్నారు.. ఈ నెల 1వ తేదీన ఢిల్లీ వెళ్లిన ఆయన.. మరుసటి రోజు టీఆర్ఎస్ కార్యాలయానికి శంకుస్థాపనలో పాల్గొన్నారు.. ఇక, మరుసటి రోజు.. ప్రధాని మోడీని, ఆ తర్వాత అమిత్‌షాను.. ఇవాళ కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, గజేంద్ర షెకావత్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలపై కేంద్రమంత్రులతో చర్చించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. రేపు కూడా హస్తినలోనే ఉండనున్నారు సీఎం కేసీఆర్.. ఇప్పటికే ఆరు…
హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు.. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయనతో చర్చించారు. తెలంగాణలోని కల్వకుర్తి నుంచి కొల్హాపూర్, సోమశిల, కరువేన గుండా ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యా వరకు (ఎన్.హెచ్ 167 కే. జాతీయ రహదారి నిర్మాణానికి నోటిఫికేషన్ జారీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన కేసీఆర్.. ఈ జాతీయ రహదారి వల్ల తెలంగాణలోని కల్వకుర్తి, కొల్హాపూర్, సోమశిల, ఆంధ్ర ప్రదేశ్ లోని ఆత్మకూరు లాంటి వెనుక…
మంత్రి హరీష్‌రావు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్… జగిత్యాల జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీని నమ్ముకొని ఈటల రాజేందర్ మోసపోయారని గమనించాలని సూచించారు.. ఇక, రబ్బరు చెప్పులు కూడా లేని హరీష్ రావుకు వందల కోట్ల ఫామ్‌హౌస్‌లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మరోవైపు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో దొంగ నోట్లు పంచిన కేసు ఉండే అని కామెంట్ చేసిన…
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్… బండికి అడ్డువస్తే పగిలిపోతుందని రాజా సింగ్ హెచ్చరించారు. బండి సంజయ్ పాదయాత్ర 100 కిలో మీటర్లు పూర్తి చేసుకున్న నేపథ్యం లో ఆయన మీడియాతో మాట్లాడారు. సంజయ్ పాదయాత్ర విజయవంతంగా సాగుతోందని… ప్రజలు స్వాగతం పలుకుతున్నారని వివరించారు. బండి సంజయ్ పై ప్రజల్లో ఎంత ప్రేమ ఉందొ స్పష్టం అవుతోందని… ఈ యాత్ర సక్సెస్ అయితే కేసీఆర్ ప్రభుత్వం పోతుంది… పేద ప్రజల బీజేపీ సర్కార్ వస్తుందని తెలిపారు.…
కేంద్రంలో వరుసగా రెండుసార్లు బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే ఏపీలో మాత్రం బీజేపీ నామమాత్రంగానే ఉంది. ఉమ్మడి ఆంధప్రదేశ్ లో కాస్తోకూస్తో బలంగా ఉన్న బీజేపీ రాష్ట్రవిభజనతో రెండు ప్రాంతాల్లోనూ పుంజుకునే పనిలో పడింది . తెలంగాణలో మాత్రం బీజేపీ క్రమంగా బలపడుతుండగా.. ఏపీలో మాత్రం ఎదుగుబొదుగు లేకుండా ఉందనే టాక్ విన్పిస్తోంది. తెలంగాణతోపాటు ఏపీలోనూ కొత్త బీజేపీ అధ్యక్షులను బీజేపీ అధిష్టానం నియమించింది. తెలంగాణలో బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ దూకుడుగా వెళుతోంది. ఏపీలో కొత్త…
ఏపీలో వినాయక చవితి వేడుకలపై ఆంక్షల వివాదం తీవ్ర రూపు దాల్చింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, సత్యకుమార్ అరెస్ట్‌పై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి.నేడు.. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు, సబ్ కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాలవద్ద బీజేపీ నేతలు ధర్నాలకు దిగనున్నారు. మరోవైపు.. వేడుకలకు ససేమిరా అంటున్నారు అధికారులు. ఏపీలో వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలను..బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ అందుకునే గణనాధుని ఉత్సవాలకు అడ్డంకులా అంటూ బీజేపీ…
గణేష్ ఉత్సవాలపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బీజేపీలో ఆందోళన చేపట్టింది. కర్నూలు ధర్నాకు దిగిన బీజేపీ నేతలు… కలెక్టర్ ఇంటిని ముట్టడించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. సోమువీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డిసహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. బీజేపీ నేతలను బలవంతంగా స్టేషన్‌కి తరలించారు పోలీసులు. కాగా… ఇవాళ ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించిన సోమువీర్రాజు… ఏపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. గణేష్ ఉత్సవాలు నిర్వహించడం పై ఏపీ సర్కార్…