సీఎం ఆదేశించినా.. పాలకమండలి నిర్ణయం తీసుకున్నా.. టీటీడీ అధికారులు ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రశ్నించారు రఘునందన్.. తెలంగాణ ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వివక్ష తగదన్న ఆయన.. పాలకమండలి అత్యవసర సమావేశమై నిర్ణయం అమలు చేయాలని సూచించారు.. వేసవి సెలవులో సిఫార్సు లేఖలు ఇస్తాం.. పరిగణలోకి తీసుకోకపోతే.. తెలంగాణ ప్రజాప్రతినిధులం అందరం తిరుమలకు వచ్చి తేల్చుకుంటాం అని వార్నింగ్ ఇచ్చారు బీజేపీ ఎంపీ రఘునందన్రావు..
MLC Vijayashanti : తెలంగాణ రాజకీయాల్లో విజయశాంతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆమె బీఆర్ఎస్పై, కేసీఆర్పై, అలాగే బీజేపీ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ పార్టీని బలవంతంగా విలీనం చేశారని ఆమె ఆరోపించారు. విజయశాంతి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో తాను కేసీఆర్ కంటే ముందే క్రియాశీలంగా పాల్గొన్నానని, తెలంగాణ రాష్ట్రం కేసీఆర్కు సొంతం కాదని స్పష్టం చేశారు. “నా పార్టీని బలవంతంగా విలీనం చేశారు. తెలంగాణ కోసం…
Mizoram local body polls: దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి వరసగా ఓటములు ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పటికే హర్యానా మేయర్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. చివరకు కాంగ్రెస్ నాయకుడు భూపిందర్ హుడా ఇలాకాలో కూడా కాంగ్రెస్ ఓడిపోయింది. మొత్తం 10 మేయర్ స్థానాల్లో 09ని గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. పదోస్థానంలో బీజేపీ రెబల్ అభ్యర్థి విజయం సాధించారు.
Ponnam Prabhakar : తెలంగాణ శాసన సభలో బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ విధానాలపై బీజేపీ నిరాధార ఆరోపణలు చేస్తున్నదని ఆయన ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “మేము ఏ పథకాన్ని నిలిపివేయలేదని స్పష్టంగా చెప్పగలము. ప్రభుత్వం కొత్త ఉద్యోగ నియామకాలకు ప్రాధాన్యత ఇస్తోంది. కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులకు విద్యాబోధన సక్రమంగా అందించాలని సూచిస్తున్నాం” అని చెప్పారు. “రాష్ట్రానికి అప్పులు ఉన్నాయనే విషయం…
Annamalai: తమిళనాడు డీఎంకే ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య ఇప్పటికే జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)పై వివాదం నడుస్తోంది. తమ రాష్ట్రంపై బలవంతంగా ‘‘హిందీ’’ రుద్దే ప్రయత్నం చేస్తో్ందని సీఎం స్టాలిన్తో సహా డీఎంకే పార్టీ మండిపడుతోంది. ఈ నేపథ్యంలో, తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2025-26 బడ్జెట్ లోగోలో రూపాయి గుర్తుకు బదులుగా తమిళ అక్షరం ‘‘రూ’’ని ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంది.
Telangana CM: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో భారత్ సమ్మిట్ నిర్వహించబోతున్నాం.. దానికి సంబంధించినటువంటి అంశాలపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రితో ఇవాళ చర్చిస్తాను.. డీలిమిటేషన్ అనేది సౌత్ ను లిమిటేషన్ చేయడానికే.. డీలిమిటేషన్ పై తెలంగాణలో జరిగే అఖిలపక్ష సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కచ్చితంగా హాజరు కావాలన్నారు
Raja Singh: కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు. హిందువులతో పెట్టుకుంటే కేసీఆర్ కు ఏమైందో రేవంత్ రెడ్డికి అదే అవుతుంది.. రేవంత్ 9వ నిజామ్ అని మండిపడ్డారు.
Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సమావేశాలు రసాభాసగా మారాయి. ప్రతిపక్ష బీజేపీ నేతలు వాకౌట్ చేశారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో దేవాలయాలపై జరుగుతున్న దాడుల గురించి, సభను వాయిదా వేయాలనే ప్రతిపాదనను స్పీకర్ తిరస్కరించారు. బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేస్తూ, పత్రాలను చింపేశారు. బీజేపీ సభ్యులకు ఎలాంటి పత్రాలు అందించొద్దని స్పీకర్ బిమన్ బంద్యోపాధ్యాయ కార్యదర్శిని ఆదేశించారు.
Minister Satya Kumar: మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికలో ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన అప్పుల రెడ్డి వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో వైద్య విద్యను కూడా భ్రష్టు పట్టించారు అని ఆరోపించారు.