BC Reservation Bill: బీసీ రిజర్వేషన్ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. విద్య, ఉద్యోగ నియామకాల్లో బీసీలకు 42 శాతం రిజ్వరేషన్లు కల్పించేలా బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించింది. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు ఆమోద ముద్ర పడింది.
Minister Seethakka: బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుపై టీఆర్ఎస్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. అపరిచితుడు సినిమాలో మాదిరిగా టీఆర్ఎస్ తన వైఖరి మారుస్తూ వస్తోంది.. ఉదయం రాము.. రాత్రి రేమోగా మారినట్లుగా వారి వ్యవహార శైలి ఉందన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగలబోతోంది.. రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పోరేషన్ గ్రేటర్ విశాఖను కైవసం చేసుకు నేందుకు కూటమి వేగంగా పావులు కదుపుతోంది. రాష్ట్రంలో అధికారం చేతులు మారిన వెంటనే మేయర్ హరి వెంకట కుమారికి పదవీ గండం తప్పదనే ప్రచారం విస్త్రతంగా జరిగింది. అయితే, సవరించిన మున్సిపల్ చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కనీసం నాలుగేళ్ల గడువు పూర్తి కావాలి. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది.. ఆ గడువు…
CM Revanth Reddy: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ చెప్పినట్టు కులగణన చేశాం.. ఫిబ్రవరి 4వ తేదీ 2024 నాడు క్యాబినెట్లో తీర్మానం చేశాం.. మూడు కోట్ల 58 లక్షల మంది సర్వేలో పాల్గొన్నారు.
Payal Shankar: జనాభా లెక్కన రిజర్వేషన్లు ఉండాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచన అని బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ అన్నారు. పూలే వారసులం అయిన బీసీలకు చదువులు దక్కడం లేదు.. తాము కరిగిపోతూ సమాజానికి సేవ చేస్తున్నాం.. అవకాశాలు మాత్రం బీసీలకు రావడం లేదు.. గత పాలకులు 7లక్షల కోట్ల అప్పులు చేశారు.
Konda Surekha: తెలంగాణ అసెంబ్లీలో లాబీలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట బోర్డు ఉండాలని చట్ట సవరణ చేశాం.. టీటీడీకి స్వయం ప్రతిపత్తి ఉంటుంది.. కానీ, యాదగిరిగుట్ట బోర్డుకు ప్రభుత్వం కంట్రోల్ లో ఉంటుంది అని తెలిపారు.
DK Aruna : ఎంపీ డీకే అరుణ ఇంట్లో ఆందోళన చెలరేగింది. అర్ధరాత్రి ఓ దొంగ ఇంట్లోకి రావడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 56లోని ఆమె ఇంట్లో చొరబడిన దొంగ గంటన్నర సేపు ఇంట్లోనే సంచరించాడని హౌస్ మెయింటేనెన్స్ ఇన్ చార్జి లక్ష్మణ్ తెలిపారు. ‘తెల్లవారు జామున 3 గంటలకు దొంగ ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. కిచెన్ దగ్గర అలజడి రావడంతో మేము మేల్కొన్నాం. అతను రెండు చేతులకు గ్లౌస్ లు, ముఖానికి మాస్క్…
BJP MLA: కేదార్నాథ్ ఆలయంలోకి హిందువులు కానీ వారిని నిషేధించాలని ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే ఆశా నౌటియల్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి కారణమైంది. కొంతమంది హిందువులు కాని వ్యక్తులు, మతపరమైన స్థలం పవిత్రతకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని కేదార్నాథ్ ఎమ్మెల్యే ఆరోపించారు. దీనిపై , ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్ స్పందించారు. బీజేపీ నాయకులకు సంచలనాత్మక వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారిందని ఆగ్రహ వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మొన్న ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పు చేసినట్లు నాకు తెలియదు అన్నాడని కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నో సభల్లో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అప్పులపై మాట్లాడిన వీడియోలు ఉన్నాయి.. రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెబుతున్నాడని పేర్కొన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. గత రెండు నెలలుగా తమిళనాడు ముఖ్యమంత్రి వితండ వాదం చేస్తున్నాడని ఆరోపించారు. దక్షిణ భారతదేశంలో మాకు అన్యాయం చేయడానికి మోదీ కుట్ర పన్నాడు అని మాట్లాడుతున్నారు.. అది పూర్తిగా రాజకీయపరమైన విమర్శ అని పేర్కొన్నారు.