Disha Salian case: సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ మరణం మరోసారి వార్తాంశంగా మారింది. దిశా తండ్రి సతీష్ సాలియన్ తన కూతురుపై సామూహిత్య అత్యాచారం జరిగిందని ఆరోపిస్తూ, బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. ఈ కేసులో ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే పేరు ఉండటం ఇప్పుడు రాజకీయంగా ఈ కేసులు ప్రాధాన్యత సంతరించుకుంది. దిశా సాలియన్ ముంబైలోని ఒక అపార్ట్‌మెంట్ 14వ అంతస్తు నుంచి పడిపోయిన చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన ఆరు రోజులకే, దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన ఫ్లాట్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దిశా సాలియన్ సుశాంత్‌కి కూడా మేనేజర్‌గా పనిచేసింది. వీరిద్దరూ ప్రేమించుకున్నారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి.
Read Also: Varalakshmi : ఆరుగురు లైంగికంగా వేధించారు.. వరలక్ష్మీ షాకింగ్ కామెంట్స్
అయితే, ఈ వ్యవహారంలో శనివారం, బీజేపీ నేత, కేంద్రమంత్రి నారాయణ రాణే సంచలన విషయాలు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..‘‘ఉద్ధవ్ ఠాక్రే తనకు ఫోన్ చేసి ఈ కేసులో తన కొడుకు ఆదిత్య ఠాక్రే పేరు తీసుకురావద్దని కోరారు’’ అని చెప్పాడు. ‘‘ఉద్ధవ్ థాకరే నాకు రెండుసార్లు కాల్ చేసాడు. నాకు మొదటిసారి కాల్ వచ్చినప్పుడు, నేను ముంబైలోని జుహులో ఉన్న నా ఇంటికి వెళ్తున్నాను. ఠాక్రే మాట్లాడుతూ..మీకు పిల్లలు ఉన్నారు. నాకు కూడా ఉన్నారు. మీరు ఈ కేసు గురించి మాట్లాడేటప్పుడు ఆదిత్య ఠాక్రే పేరు ప్రస్తావించవద్దు అని నన్ను అభ్యర్థించారు. ’’ అని నారాయణ్ రాణే విలేకరుల సమావేశంలో చెప్పాడు.
Read Also: Delimitation: మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ వద్దు.. స్టాలిన్ మీటింగ్‌లో 7-పాయింట్ల తీర్మానం..
‘‘ ఒక అమాయకమైన అమ్మాయి హత్యకు గురైంది. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి, అందులో రాజీ లేదు.’’ అని తాను ఉద్ధవ్ ఠాక్రేకి స్పష్టం చేశానని రాణే వెల్లడించారు. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆదిత్య ఠాక్రేని అరెస్ట్ చేయాలి అని రాణే అన్నారు. రెండోసారి ఫోన్ చేసిన సమయంలో, తన ఆస్పత్రి అనుమతి కోసం మాట్లాడానని, అయితే, అనుమతి వస్తుందని ఠాక్రే చెప్పారని, కానీ అతడి పేరు(ఆదిత్య) ప్రస్తావించొద్దని మరోసారి అభ్యర్థించారని రాణే వెల్లడించాడు.
అయితే, ఉద్ధవ్ ఠాక్రే ఈ వాదనల్ని తోసిపుచ్చారు. తన కుమారుడు ఆదిత్య ఠాక్రేకి, దిశా సాలియన్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఆదిత్య మాట్లాడుతూ, తన పేరును అప్రతిష్టపాలు చేసేందుకు బీజేపీ ఈ ఆరోపణలు చేయిస్తుందని విమర్శించారు. మరోవైపు, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా హత్యకు గురయ్యాడని రాణే ఆరోపించాడు.