బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్పోర్టులో పట్టుబడ్డ నటి రన్యారావు కేసు ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. రన్యా రావు సంస్థకు భూమి కేటాయింపుపై అధికార కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
నేటి నుంచి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తొలి విడత బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై.. ఫిబ్రవరి 13న ముగిశాయి. ఇక ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక సోమవారం నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి.
Annamalai: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ప్రభావం పెరగడం వల్ల 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, బీజేపీతో పలు పార్టీలు పొత్తులు కోరుతున్నాయని అన్నారు. పరోక్షంగా అన్నాడీఎంకేని ఉద్దేశిస్తూ ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఐడీఎంకే చీఫ్ పళనిస్వామి ఇటీవల మాట్లాడుతూ.. పొత్తుల కోసం తలుపులు తెరిచే ఉన్నాయని అన్నారు.
ఎంపీల మీటింగ్ కి బీజేపీ ఒక్కటే కాదు ఏ పార్టీ హాజరు కాలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. రాష్ట్ర ప్రజల హక్కుల కోసం, వాట కోసం కొట్లాడేది బీజేపీ తప్ప ఎవరు లేరన్నారు. మమ అనిపించుకునేందుకే సమావేశం నిరహించారని చెప్పారు.. ఢిల్లీ వేదికగా చర్చ చేద్దాం.. 28 అంశాల్లో ఏవేవి పెండింగ్ లో ఉన్నాయో చర్చ చేద్దాం.. ఢిల్లీలో పెట్టండి మీటింగ్ అని సవాల్ విసిరారు. అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని.. రండి ఢిల్లీకి…
Rahul Gandhi: రాహుల్ గాంధీ గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గుజరాత్లో పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం వస్తే 40 మంది వరకు నాయకులను తొలగించేందుకు కాంగ్రెస్ సిద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీకి కొందరు కాంగ్రెస్ నేతలు రహస్యం పనిచేస్తున్నారని ఆయన ఆరోపించడం సంచలనంగా మారింది. గుజరాత్ ప్రజలతో మనం కనెక్ట్ కావాలంటే ప్రజలతో ఉండే నాయకులను, ప్రజలకు దూరంగా ఉండే నాయకులను గుర్తించాలని చెప్పారు. అహ్మదాబాద్లో జరిగిన…
కేసీఆర్ అసెంబ్లీకి ఎప్పుడు వస్తారా? అని తాము కూడా ఎదురుచూస్తున్నామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మీరు అసెంబ్లీకి వచ్చి కూసుంటే.. అన్ని సమస్యలకూ పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు. మీరు ఏడు లక్షల కోట్లు చేసింది మీరే కాబట్టి.. ఏం చేశారో చెప్పాలన్నారు. ఇప్పటికీ కూడా కేసీఆర్ జనం అధికారం నుంచి తరిమేశారు అనే అనుకోవడం లేదని.. జనం మమ్మల్ని మిస్ అయ్యారు అనే అనుకుంటున్నారన్నారు. తప్పేంటి.. ఒప్పేంటి అనే చర్చ లేదని.. కేసీఆర్…
ఆర్ఆర్ఆర్ అంచనా వ్యయం రూ.18,772 కోట్లు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.. రూ.300 కోట్లతో ఆరాంఘర్ నుంచి శంషాబాద్ వరకు ఆరు లేన్ల నేషనల్ హైవే పూర్తి చేస్తామని వెల్లడించారు.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్లేవారికి సిగ్నల్ ఫ్రీ రోడ్ అవుతుందన్నారు.. పార్లమెంట్ సమావేశాల తర్వాత నితిన్ గడ్కరీ పనులు ప్రారంభిస్తారని తెలిపారు. కాంగ్రెస్ గురుంచి తాను మాట్లాడ దాల్చుకోలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయం లో వాళ్ళ కన్నా ఎక్కువ మాకు ఉందని స్పష్టం చేశారు.…
బీజేపీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్ని మతాలను దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. దేశంలో చాలా తక్కువ శాతం ఉన్న మతాల పరిస్థితి ఉందని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం భయందోళనలో ఉందని ఆరోపించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిల పక్షం సమావేశం అయింది. ప్రజా భవన్లో ఈ సమావేశం జరుగుతుంది. కాగా.. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. బీఆర్ఎస్ ఎంపీలు దూరంగా ఉన్నారు.