ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా 26 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఫిబ్రవరిలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక బీజేపీకి స్పష్టమైన మేజిక్ ఫిగర్ దాటింది. కానీ ముఖ్యమంత్రి ఎంపిక మాత్రం చాలా ఆలస్యం అయింది. దీనికి కారణం.. ఆ సమయంలోనే ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు వెళ్లారు. మోడీ తిరిగి వచ్చేంత వరకూ ఢిల్లీ ముఖ్యమంత్రి ఎంపిక జరగదని అధిష్టానం తేల్చిచెప్పింది. ఆ సమయంలో పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మతో పాటు పలువురి పేర్లు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారంటూ వార్తలు వినిపించాయి. కానీ అనూహ్యంగా రేఖా గుప్తా ముఖ్యమంత్రి అయ్యారు.
ఇది కూడా చదవండి: Rashmika: 59 ఏళ్ల హీరోతో నటించిన రష్మిక.. ఆఫర్ వచ్చినప్పుడు తన ఫస్ట్ రియాక్షన్ ఇదే!
తాజాగా ఇదే అంశంపై రేఖా గుప్తా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఎంపిక విషయం ఎవరి ఫోన్ చేసి చెప్పారని? అసలు ఆ విషయం ఎలా తెలిసిందంటూ రేఖా గుప్తాను మీడియా ప్రతినిధి అడిగారు. దీనికి రేఖా గుప్తా సమాధానం ఇస్తూ.. ముఖ్యమంత్రి అవుతున్నట్టు తనకు తెలియదన్నారు. అందరి ఎమ్మెల్యేల్లాగానే తాను కూడా బీజేపీ శాసనసభాపక్ష సమావేశానికి వెళ్లానని.. అధిష్టానం దూతలు సీఎం పేరు ప్రకటించేంత వరకు ఆ విషయం తనకు తెలియదని రేఖా గుప్తా స్పష్టం చేశారు. అంతకముందు అధిష్టానం నుంచి తనకు ఫోన్ కాల్ రాలేదని.. కేవలం ఎమ్మెల్యేల సమావేశంలో మాత్రమే ముఖ్యమంత్రిగా ఎంపికైనట్లు తెలిసిందన్నారు.
అయితే ఎమ్మెల్యే కావాలనే కల అయితే ఉండేదని.. కానీ ముఖ్యమంత్రి అవుతానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. సుదీర్ఘ కాలం రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ అత్యున్నత పదవికి ఎంపిక కావడం పట్ల ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత అనేక పేర్లు తెరపైకి వచ్చాయని.. అందులో తన పేరు కూడా వినిపించిందని.. కానీ తుది నిర్ణయం హైకమాండ్‌దేనని చెప్పారు. ఈ విషయంలో తన పాత్ర ఏమీలేదని తేల్చి చెప్పారు.
ఇది కూడా చదవండి: Saif Ali Khan: “ఇదంతా కుట్ర”..కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో నిందితుడు..
అయితే ఎమ్మెల్యేల సమావేశంలో ఒక సంఘటన జరిగిందని.. ఒక నాయకుడు తన దగ్గరకు వచ్చి ఏదైనా కాల్ వచ్చిందా? అని అడిగాడని.. కానీ అలాంటిదేమీ రాలేదని సమాధానం ఇచ్చానన్నారు. అతడు.. తనను అబద్ధాలకోరు అని పిలిచాడన్నారు. అయితే ఎవరికి కాల్ వచ్చింది.. ఎమ్మెల్యేల ముఖాలను చూడమని సలహా ఇచ్చాడు. ఎవరి ముఖంలో చిరునవ్వు ఉంటుందో వారికే కాల్ వచ్చి ఉంటుందని ఆ నాయకుడు తనతో అన్నాడని ఆ నాటి విషయాలను రేఖా గుప్తా గుర్తుచేశారు. అనంతరం మరొక సీనియర్ నాయకుడు వచ్చి.. ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నట్లు చెప్పాడన్నారు. మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయకపోతే ఎటువంటి సమస్య లేదని.. ఏది జరిగినా అది మంచికే జరుగుతుందని ఆయన తనతో అన్నట్లుగా తెలిపారు. తనకు ఏ బాధ్యతలు అప్పగించినా కంఫర్ట్ జోన్‌లో పని చేస్తానని ఆయనకు బదులిచ్చినట్లు రేఖా గుప్తు పేర్కొన్నారు.
ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. బీజేపీ 48, ఆప్ 22 స్థానాల్లో విజయం సాధించింది. ఫిబ్రవరిలో రాంలీలా మైదానంలో రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా కేంద్ర పెద్దలంతా హాజరయ్యారు. రేఖాగుప్తాతో పాటు ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇది కూడా చదవండి: Vikram : ప్రేక్షకులకు క్షమాపన చెప్పిన ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ నిర్మాత