Ambati Rambabu: ఎమ్మెల్యే నా కొడకల్లారా అంటూ వేదికపైనే.. పవన్ అసహ్యంగా మాట్లాడలేదా?
- పవన్ కల్యాణ్‌పై అంబటి రాంబాబు ఫైర్
- పవన్ మాటలు విని పశ్చాత్తాపపడ్డా
- మీరు ఎప్పుడూ అసహ్యంగా మాట్లాడలేదా? పవన్
- నా కొడకా అంటే అర్దం తెలుసా పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu Fires at Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. మీరు అసహ్యంగా మాట్లాడితే ఒప్పు, మేము మాట్లాడితే తప్పా? అని ప్రశ్నించారు. అసహ్యంగా మాట్లాడినందుకే దాడులు జరుగుతున్నాయని పవన్ మాట్లాడుతున్నారని, ఆయన మాటలు విని పశ్చాత్తాపపడ్డాను అని తెలిపారు. పవన్.. మీరు ఎప్పుడూ అసహ్యంగా మాట్లాడలేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అని వేదికపై చెప్పు తీశావు, అప్పుడు నేను ఎమ్మెల్యేనే కదా? అని అడిగారు. నా కొడకా అంటే అర్దం తెలుసా.. ఇప్పటికైనా పశ్చాతాపం పడ్డావా? అని ప్రశ్నించారు. అన్యాయాన్ని అన్యాయం అనలేని నువ్వు.. ఏం డిప్యూటీ సీఎంవు అని అంబటి ధ్వజమెత్తారు.
అక్రమ కేసులో అరెస్ట్ అయిన అంబటి రాంబాబు గురువారం బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను కలిశారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడుతూ… ‘అంబటి కాపు కాదా. సందర్భం వచ్చినప్పుడు కాపుల కోసం గొంతెత్తా. నేను కమ్మ ద్వేషిని కాదు. నా కులం తరపున మాట్లాడా. చిరంజీవి వచ్చి కాపులకు మద్దతుగా మాట్లాడారు. వంగవీటి రంగాను కోల్పోయాం.. ముద్రగడను కోల్పోవడానికి సిద్ధంగా లేమన్నారు. అప్పుడు నాగబాబు, పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు. మీరే కాపులా. చంద్రబాబును తిడితే కమ్మవారిని తిట్టినట్లా. రాంబాబును తిడితే, ఇల్లు తగలబెడితే.. కార్లు తగలబెడితే ఏం జరిగినట్లు. నేను కులం లేని అనాథనా. రాంబాబును తిడితే ఎవరికీ కోపం రాకూడదా. చంద్రబాబు మోచేతి నీళ్ళు ఎన్నాళ్లు తాగుతారు. ప్రతి కుక్కకు ఒకరోజు వస్తుంది. రాంబాబుకు కూడా ఒకరోజు వస్తుంది. కులాల ప్రస్థావన తీసుకొస్తుంది మీరే. చంద్రబాబు, పెమ్మసాని ప్రతి విషయం పర్యవేక్షించారు. పద్దెనిమిది రోజులు జైలులో పెడితే రాంబాబు భయపడతాడా?. విద్యార్థి దశ నుంచి రాజకీయాలలో ఉన్నాను. కేసులు, జైలులో పెడితే భయపడానా?. 18 నెలలు జైలులో పెట్టినా భయపడను’ అని అన్నారు.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
Also Read: Brian Bennett: టీ20 వరల్డ్‌కప్‌లో ఔట్ కాని బ్యాటర్ బెన్నెట్.. మూడు ఇన్నింగ్స్‌లలో 175 రన్స్!
‘పోలీసుల సహకారంతో చంపే అలవాటు చంద్రబాబుకు ఉంది. చంద్రబాబు అలవాటే కొడుకు లోకేష్ నారాకు వచ్చింది. పార్టీలు మారి అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉండేవాడిని కాదు. కేసు మీద కేసు పెట్టారు. రాజమండ్రిలో చెప్పా.. మళ్లీ వస్తానని చెప్పా. మళ్లీ కేసులు పెట్టి జైలుకు పంపిస్తారని చెప్పాను. చంపేస్తే సమాధిలో ఉండి సాధిస్తా. అసహ్యంగా మాట్లాడినందుకే దాడులు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, పశ్చాత్తాప పడ్డాను. పవన్.. మీరు ఎప్పుడూ అసహ్యంగా మాట్లాడలేదా. వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అని వేదికపై చెప్పు తీశావు. నేను అప్పుడు ఎమ్మెల్యేనే కదా?. నా కొడకా అంటే అర్దం తెలుసా?. ఇప్పటికైనా పశ్చాతాపం పడ్డావా?. అన్యాయాన్ని అన్యాయం అనలేని నువ్వు ఏం డిప్యూటీ సీఎంవు’ అని అంబటి ఫైర్ అయ్యారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!