Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వ ‘‘క్రోనిజం’’, ‘‘దుర్వినియోగం’’ భారతదేశ బ్యాంకింగ్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయని అన్నారు. దీంతో ఒత్తిడి, కఠినమైన పని పరిస్థితులను జూనియర్ ఉద్యోగులు భరించాల్సి వస్తోందని అన్నారు. బీజేపీ ప్రభుత్వ ఆర్థిక దుర్వినియోగం మానవ నష్టాన్ని కలిగిస్తుంది, దేశవ్యాప్తంగా వేలాది మంది నిజాయితీగల వృత్తి నిపుణులను ప్రభావితం చేస్తుందని ఆరోపించారు.
Read Also: Myanmar Earthquake: మయన్మార్‌లో మరోసారి భూకంపం.. 4.7గా తీవ్రత నమోదు..
బీజేపీ ప్రభుత్వం తన ‘‘బిలియనీర్ స్నేహితుల’’ కోసం రూ. 16 లక్షల కోట్లను మాఫీ చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రభుత్వ ఆర్థిక దుర్వినియోగం వేలాది మంది నిజాయితీపరులైన వర్కింగ్ ప్రొఫెషనల్స్‌ని ప్రభావితం చేస్తోందని ఆరోపించారు. ఎక్స్‌లో ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ, మాజీ ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశానికి సంబంధించిన వీడియోని షేర్ చేశారు. నిర్వహణ లోపాల వల్ల వీరంతా నష్టపోయారని అన్నారు. కాంగ్రెస్ ఇలాంటి శ్రామిక తరగతి నిపుణుల కోసం పోరాడుతుందని, పనిలో వేధింపులు, దోపిడీని అంతం చేస్తామని చెప్పారు. ‘‘మీరు ఇలాంటి అన్యాయాన్ని ఎదుర్కొన్న వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే https://rahulgandhi.in/awaazbharatki కి మీ కథను నాతో పంచుకోండి’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
782 మంది మాజీ ఐసీఐసీఐ బ్యాంక్ ఉద్యోగుల తరుపున ఒక ప్రతినిధి బృందం నిన్న పార్లమెంట్‌లో తనను కలిసిందని అన్నారు.‘‘ వీరి కథలు ఆందోళనకరమైన విషయాలను వెల్లడిస్తున్నాయి. కార్యాలయంలో వేధింపులు, బలవంతంపు బదిలీలు, ఎన్‌పీఏ ఉల్లంఘించిన వారికి అనైతిక రుణాలను బహిర్గతం చేసినందుకు ప్రతీకారం, తగిన ప్రాసెస్ లేకుండా తొలగింపులు, విషాదకరమైన సందర్భాల్లో ఇది ఆత్మహత్యకు దారి తీసింది’’ అని అన్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ అన్యాయంగా తమను తొలగించిందని ఆరోపిస్తున్న ఉద్యోగులు బృందం శుక్రవారం రాహుల్ గాంధీని కలిసింది.
The BJP government has written off ₹16 lakh crore in loans for their billionaire friends. Cronyism, coupled with regulatory mismanagement has pushed India’s banking sector into crisis. This burden is ultimately borne by junior employees, who endure stress and toxic work… pic.twitter.com/v9BoxDgQVY
— Rahul Gandhi (@RahulGandhi) March 29, 2025