బీజేపీ కార్యాలయంలో సూర్యనారాయణ మూర్తి పంచాంగ శ్రవణం చేశారు. ప్రపంచానికి దిశా నిర్దేశనం చేసే శక్తి భారత దేశానికే ఉంది. ప్రతి మహిళలో తల్లిని చూడాలనే జ్ఞానం అందరిలో పెరుగుతుంది. ప్రభలమైన మార్పులు దేశంలో చోటు చేస్కోబోతున్నాయి. పాడి పంటలతో దేశం, ప్రతి గ్రామం పరిడవిల్లుతుంది. కాంతిని పూజించడంలో ఆనందించేవారు భారతీయులు. భారతదేశాన్ని రక్షించే రాజకీయ పక్షం బీజేపీ.
ఒకే దేశం – ఒకే ఎన్నిక ప్రాముఖ్యత, సవాళ్ళు, ప్రభావం పై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ న్యాయమూర్తి బి.శివశంకరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతు.. రాజకీయాలు విరమించి ప్రజాజీవనంలో మాత్రమే పాల్గొంటున్నా.. రాజ్యాంగంలో ఉన్నత పదవి నుంచి వచ్చాక రాజకీయాలు మాట్లాడకూడదు.. పదవీ విరమణ చేసాను కానీ పెదవి విరమణ చేయలేదు.. రాజకీయంగా కనిపించని రాజకీయ అంశాలు మాట్లాడతాను.. ఒకే దేశం ఒకే ఎన్నిక…
Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వ ‘‘క్రోనిజం’’, ‘‘నియంత్రణ దుర్వినియోగం’’ భారతదేశ బ్యాంకింగ్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయని అన్నారు. దీంతో ఒత్తిడి, కఠినమైన పని పరిస్థితులను జూనియర్ ఉద్యోగులు భరించాల్సి వస్తోందని అన్నారు. బిజెపి ప్రభుత్వ ఆర్థిక దుర్వినియోగం మానవ నష్టాన్ని కలిగిస్తుంది, దేశవ్యాప్తంగా వేలాది మంది నిజాయితీగల పని నిపుణులను ప్రభావితం చేస్తుందని ఆరోపించారు.
Local Body Election: లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ దూరంగా ఉండేందుకు నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సరైన బలం లేని కారణంగా పోటీకి దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం.
కార్పొరేట్ సంస్థలను కాపాడుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ సమ్మెట్లో అబద్ధాలు చెప్పడం విచారకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.. ఒక ప్రముఖ ఛానల్ ప్రధానమంత్రితో నిర్వహించిన సమ్మెట్లో దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి లేదని, అభివృద్ధి పెరిగిందని, కాంగ్రెస్‌లో అవినీతి పెరిగిందని చెప్పడం సత్య దూరమని ఆయన అన్నారు. ఎన్. పి. ఎ. కింద 16 లక్షల కోట్లు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్వయంగా చెప్పారని, 2014 కంటే ముందు…
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్న రాహుల్ గాంధీ ఆరోపణలను అమిత్ షా కొట్టిపారేశారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా 26 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఫిబ్రవరిలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక బీజేపీకి స్పష్టమైన మేజిక్ ఫిగర్ దాటింది. కానీ ముఖ్యమంత్రి ఎంపిక మాత్రం చాలా ఆలస్యం అయింది. దీనికి కారణం.. ఆ సమయంలోనే ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు వెళ్లారు.
Tamil Nadu: వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయ వాతావరణం ఇప్పటికే వేడెక్కింది. అధికార డీఎంకేతో పాటు తమిళ స్టార్ విజయ్ పార్టీ టీవీకే, బీజేపీ, అన్నాడీఎంకేలు తమ తమ ప్రచార వ్యూహాలకు పదును పెట్టాయి. ఇదిలా ఉంటే, తమిళ ప్రజలు ఎవరిని సీఎంగా ఇష్టపడుతున్నారనే దానిపై సర్వే జరిగింది. సీఓటర్ సర్వే తమిళ ప్రజల మనోభావాలను ప్రతిబింబించింది.
L2: Empuraan: మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన కొత్త సినిమా ‘ఎల్2:ఎంపురాన్’ వివాదానికి తెరతీసింది. కేరళలో అధికార కమ్యూనిస్ట్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఈ సినిమాని స్వాగతించాయి. అయితే, అదే సమయంలో ‘‘సంఘ్ ఎజెండా’’ని సినిమా బహిర్గతం చేసిందని ఆ పార్టీలు, బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నాయి. లూసిఫర్ సినిమా సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాలో పరోక్షంగా 2002 గుజరాత్ అల్లర్లను సూచిస్తుంది. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని ఈ సినిమా చర్చించింది.
Uddhav Thackeray: శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే బీజేపీని విమర్శించారు. బీజేపీ కొత్తగా ప్రారంభించిన ‘‘సౌగత్-ఏ-మోడీ’’ పథకంపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ హిందుత్వాన్ని వదిలిపెట్టి సత్తా జిహాద్(పవర్ జిహాద్)ని ఆశ్రయించిందని ఆరోపించారు. బీజేపీ పథకాన్ని ఠాక్రే ‘‘'సౌగత్-ఎ-సత్తా (అధికార బహుమతి)’’గా అభివర్ణించారు. బీహార్‌లో ఎన్నికల ప్రయోజనం కోసం బీజేపీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.