బీజేపీ కార్యాలయంలో సూర్యనారాయణ మూర్తి పంచాంగ శ్రవణం చేశారు. ప్రపంచానికి దిశా నిర్దేశనం చేసే శక్తి భారత దేశానికే ఉందన్నారు. ప్రతి మహిళలో తల్లిని చూడాలనే జ్ఞానం అందరిలో పెరుగుతుందని తెలిపారు. ప్రభలమైన మార్పులు దేశంలో చోటు చేస్కోబోతున్నాయని.. పాడి పంటలతో దేశం, ప్రతి గ్రామం పరిడవిల్లుతుందని చెప్పారు. కాంతిని పూజించడంలో ఆనందించేవారు భారతీయులని.. భారతదేశాన్ని రక్షించే రాజకీయ పక్షం బీజేపీ అని వెల్లడించారు. భారతీయ జనతా పార్టీలో భా అంటే కాంతి అన్నారు.. ప్రపంచ దేశాల్లో పెద్ద పెద్ద ప్రమాదాలు వస్తున్నాయని హెచ్చరించారు. అలాంటి వాటన్నింటిని చెప్పే చిన్న పుస్తకమే పంచాంగమని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేసే శక్తి భారత్ కే ఉందన్నారు.. జూలై చివర, ఆగస్టులలో విశేష వర్షాలు కురుస్తాయి వెల్లడించారు. వర్షాలు కురిసి ప్రతి గ్రామం సస్యశ్యామలంగా ఉంటాయని.. కొద్దిపాటి ఇబ్బందులు విద్యార్థులకు వస్తాయన్నారు. జూన్, జులై, నవంబర్, డిసెంబర్, జనవరి నెలలతో పాటు ఫిబ్రవరి 17 వరకు ముహుర్తాలు ఉండవని చెప్పారు. మహిళలకు ఈ ఏడాది బీజేపీ పెద్దపీట వేస్తుందని.. ప్రపంచ దేశాలకు భారత్ దేవాలయం అవుతుందని సూర్యనారాయణ మూర్తి వెల్లడించారు.
READ MORE: CM Chandrababu: ప్రస్తుతం టెక్నాలజీ మీద ప్రపంచం ఆధారపడి ముందుకెళ్తోంది..
పంచాంగ శ్రవణం కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. “సూర్యనారాయణ మూర్తి పంచాంగ పఠనం విన్నాం. హిందువుల ప్రతి పండుగలో సైన్స్ ఉంటుంది, సందేశం ఉంటుంది. కులాలకు అతీతంగా, ధనిక పేద తేడా లేకుండా అందరూ సంతోషంగా జరుపుకుంటాం. వచ్చే ఉగాది వరకు దేశం మరింత సస్యశ్యామలం కావాలని, దేశ ప్రతిష్ట మరింత పెరగాలని, మోడీ నాయకత్వంలో అన్ని రంగాల్లో దేశం ముందుకు వెళ్ళాలని, ప్రకృతి వైపరిత్యాలు లేకుండా ఉండాలని కోరుకుంటున్న.. బీజేపీ నీ మరింత పటిష్టం చేసుకోవడానికి ప్రతిజ్ఞ తీసుకోవాలి. రాష్ర్ట, జాతీయ కమిటీ లు త్వరలోనే వస్తాయి.. బీజేపీ ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉంది.” అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలందరికీ బీజేపీ, మోడీ తరఫున ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.