లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్న రాహుల్ గాంధీ ఆరోపణలను అమిత్ షా కొట్టిపారేశారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వియత్నాంలో ఉన్నారని.. అక్కడ నుంచి వచ్చాక మాట్లాడతానంటూ పట్టుబట్టారన్నారు. సభలో మాట్లాడటానికి నియమాలు ఉంటాయన్న సంగతి ప్రతిపక్ష నాయకుడికి తెలియకపోవచ్చన్నారు. ఇష్టానుసారంగా సభను నడపలేం కదా? అని చెప్పారు. అయినా బడ్జెట్‌పై చర్చల్లో 42 శాతం సమయం రాహుల్‌కే ఇచ్చామని పేర్కొన్నారు. పార్లమెంట్ అనేది వారి పార్టీలా కాకుండా… నిబంధనలకు అనుగుణంగా నడుస్తోందని హితవు పలికారు. అయినా ప్రతిపక్ష నేత సభా నియమాలు, నిబంధనలు పాటించాలని అమిత్ షా సూచించారు.
ఇది కూడా చదవండి: Vijay Varma : ఒక బంధాన్ని ఐస్‌క్రీంలా ఆస్వాదించాలి..
దేశంలో ప్రజాస్వామ్యం లేదన్న కాంగ్రెస్ ఆరోపణలను కూడా అమిత్ షా ఖండించారు. దేశంలో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులుంటే.. కాంగ్రెస్ నేతలంతా జైల్లో ఉండేవారన్నారు. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు కాంట్రాక్టుల్లో 4 శాతం కోటా ప్రకటించడాన్ని అమిత్ షా తప్పుపట్టారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇలా చేయడం కరెక్ట్ కాదన్నారు. ఇక వచ్చే ఏడాది తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: టీడీపీని లేకుండా చేస్తామని చాలా మంది చెప్పారు కానీ.. వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు..
ఇక మణిపూర్‌లో పరిస్థితులు సద్దుమణిగాయని.. శాంతి వాతావరణం నెలకొందని తెలిపారు. పరిస్థితులు క్రమక్రమంగా సాధారణ స్థితికి వస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే మణిపూర్ కోలుకుంటుందని చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే వక్ఫ్ (సవరణ) బిల్లును ప్రవేశపెడతామని తేల్చిచెప్పారు. సవరణ రాజ్యాంగానికి అనుగుణంగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: టీడీపీని లేకుండా చేస్తామని చాలా మంది చెప్పారు కానీ.. వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు..