Pax Silica: పాక్స్ సిలికాలో చేరిన భారత్.. అమెరికాతో ఒప్పందం
- పాక్స్ సిలికాలో చేరిన భారత్
- అమెరికాతో ఒప్పందం
- సంతకం చేసిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాకు చెందిన పాక్స్ సెలికాలో భారత్ చేరింది. ఈ మేరకు ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో ప్రకటించింది. అంతేకాకుండా కూటమిలో చేరుతున్నట్లు భారత్ సంకతం కూడా చేసింది. అమెరికా రాయబారి సెర్గియో గోర్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ సమక్షంలో సంతకాలు జరిగాయి.

Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
భారత్ చేసిన సంతకంతో కీలక ఖనిజాల ఉత్పత్తి, కృత్రిమ మేధ వంటి రంగాల్లో రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ప్రపంచం భారత్‌ను విశ్వసిస్తోందన్నారు. భారత్‌లో నిపుణుల కొరత లేదని చెప్పారు. కూటమిలో చేరడంతో భారత ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ పరిశ్రమకు లబ్ధి చేకూరనుందని వెల్లడించారు.
గత సంవత్సరం డిసెంబర్‌లో వాషింగ్టన్‌లో జరిగిన పాక్స్ సిలికా సమ్మిట్‌లో కూటమి ప్రారంభించబడింది. ఇందులో ఆస్ట్రేలియా, గ్రీస్, ఇజ్రాయెల్, జపాన్, ఖతార్, దక్షిణ కొరియా, సింగపూర్, యూఏఈ, యూకే వంటి దేశాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా భారత్ చేరింది.
ఇండియా-పాక్స్ సిలికాలో భారత్ చేరడాన్ని అమెరికా రాయబారి ప్రశంసించారు. భారతదేశం- అమెరికా మధ్య వ్యూహాత్మక కూటమిగా అమెరికా రాయబారి సెర్గియో గోర్ అభివర్ణించారు. 21వ శతాబ్దపు ఆర్థిక, సాంకేతికను రూపొందించడానికి చాలా అవసరం అన్నారు. భారతదేశ ఇంజనీరింగ్ ప్రతిభను.. అమెరికా -భారత్ టెక్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఇదొక మంచి పాత్రగా అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన AIని ప్రోత్సహించడం ఈ భాగస్వామ్యం లక్ష్యమని అన్నారు.
- Tags
- AI
- america
- Delhi
- India joins
- Pax Silica
తాజావార్తలు
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!