తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నల్గొండ పర్యటనలో జరిగిన దాడిపై నేడు గవర్నర్ తమిళసై సౌందర రాజన్‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ నల్లొండలో పర్యటిస్తున్న సమయంలో ఆయన కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేశారు. అయితే దీనిపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని తెలుపుతూ గవర్నర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. గ్రామాల్లోకి వెళ్లి రైతుల బాధలు…
రైతులు ఇబ్బందులు పడుతుంటే రాజకీయాల వారిపైనే కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 500,1000 రూపాయలు ఇచ్చి కిరాయి గుండాలతో TRS నేతలు బండి సంజయ్ వెహికిల్ పై రాళ్ళ దాడి చేశారని ఆయన అన్నారు. బీజేపీ కార్యకర్తలు దీటుగా ఎదుర్కొని టీఆర్ఎస్ కార్యకర్తలకు, గుండాలకు సరైన సమాధానం చెప్పారన్నారు. రైతులను కాపాడాల్సిన ముఖ్యమంత్రి, రైతులను మోసం చేస్తున్నాడు. హుజూరాబాద్ ఎలక్షన్ లో TRS ఓటమిని తట్టుకోలేక…
ఇటీవల ఎప్పుడు ఏదో ఒక కాంట్రావర్సీతో వార్తల్లో నిలుస్తున్న కంగనా పై తాజాగా అసదుద్దీన్ ఓవైసీ సైటైర్లు విసిరారు. స్వాతంత్ర్యంపై కంగనా చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. కంగనా 2014లోనే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని, 1947లో వచ్చింది కేవలం భిక్ష అని కామెంట్స్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా కంగనా పై విమర్శల పాలైంది. తను తీసుకున్న పద్మశ్రీ అవార్డును సైతం వెనక్కి ఇచ్చి వేయాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. దీనిపై బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అడుగడుగునా బండిని అడ్డుకోవడం.. వాగ్వాదాలు, తోపులాటలు, రాళ్ల దాడులు, కోడిగుడ్లు విసరడం లాంటి ఘటనలు చర్చగా మారాయి.. అయితే.. ఈ పరిణామాలపై స్పందించిన రైతు బంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి.. ధాన్యం సేకరణపై పాలసీ చెబితేనే బండి సంజయ్‌ని తిరగనిస్తాం అన్నారు.. బండి సంజయ్‌ను తెలంగాణ రైతుల తరపున వెంటాడతాం… వేటాడుతామన్న ఆయన.. నల్గొండ రైతులపై దాడులు చేసిన…
రేపు టీఆర్స్ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం 4గంటలకు శాసనసభ పక్షం భేటీ కానుంది. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రప్రభుత్వ తీరుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీరు, రాష్ర్ట బీజేపీ మరో విధంగా వ్యవహరిస్తుందని.. దీంతో రైతులు అయోమయా నికి గురవుతున్నారని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇప్పటికే ధర్నాలకు సైతం పిలుపునిచ్చింది. దీనిపై టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో భవి ష్యత్ కార్యచరణను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ వైఖరి, బీజేపీ…
శాంతి భద్రతలను కాపాడటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ గుండాల దాడిలో బీజేపీ నేతల వాహనాలు ధ్వంసం అయ్యాయన్నారు. దాడి అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులను బెదిరించడమేంటని ఆయన మండి పడ్డారు. సీఎం డైరెక్షన్లోనే దాడులకు కుట్ర జరిగిందన్నారు. ప్రతి పక్ష పార్టీ అధ్యక్షుడిగా రైతులను కలిసేందుకు వస్తుంటే టీఆర్ఎస్ నేతలకు ఎందుకింత అసహనం వస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. మీ అసలు బండారం…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి.. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ప్రకటించారు.. నామినేషన్లు వేసిన 18 మందిలో 3 నామినేషన్ల ఉపసంహరణతో ఏకగ్రీవం అయినట్టుగా వివరించారు లోకేష్ కుమార్.. కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్, వనం సంగీత యాదవ్ నామినేషన్లు ఉపసంహరించుకున్నారని వెల్లడించిన ఆయన.. దీంతో స్టాండ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం అయినట్టు తెలిపారు.. ఇక, ఏక గ్రీవంగా ఎన్నికైన జీహెచ్ఎంసీ స్టాండింగ్…
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగుతోంది.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న బండి సంజయ్‌ను అడుగడునా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి టీఆర్ఎస్ శ్రేణులు.. దీంతో.. పలు చోట్ల టీఆర్ఎస్-బీజేపీ నేతల మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి.. ఇక, వారిని చెదరగొట్టేందుకు లాఠీలకు పోలీసులు పనిచెప్పాల్సి వచ్చింది. Read Also: విశాఖ టు మధ్యప్రదేశ్.. అమెజాన్ ద్వారా గంజాయి..! తాజాగా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల చిల్లేపల్లిలో బండి సంజయ్…
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం అయ్యారు రాష్ట్ర బీజేపీ నేతలు.. అయితే, ఈ సమావేశంలో ఏపీ నేతలకు అమిత్‌షా పెద్ద క్లాసే తీసుకున్నారట.. ఏపీ కో-ఇంచార్జ్ సునీల్ దేవధర్, ఎంపీ జీవీఎల్‌కి ప్రత్యేకంగా ఆయన క్లాస్ పీకినట్టు సమాచారం.. వైసీపీయే మన ప్రధాన శత్రువు… ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని సూచించిన ఆయన.. అమరావతే ఏపీ రాజధాని అన్నది బీజేపీ స్టాండ్.. రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలపాలని సూచించారు.. జనసేనా…