వడ్ల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం, టీఆర్‌ఎస్ సర్కార్ ల మధ్య పంచాయితీ తెగడం లేదు. నిన్న కేంద్రం తీరుపై సీఎం కేసీఆర్ మండిపడగా… తాజాగా కేంద్రంపై రెచ్చిపోయారు హరీష్‌రావు.
వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాద్ధాంతం చేస్తుందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లలో మొత్తం కలిపి ఎన్ని వడ్లు కొన్నారో… ఒక్క సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అన్ని వడ్లు కొనుగోలు చేసామో తెలుసుకోవాలన్నారు.
కాంగ్రెస్, బీజేపీ హయాంలో ఉన్న కొనుగోలు కేంద్రాలు ఎన్ని ? టీఆర్ఎస్ హయాంలో ఉన్న కొనుగోలు కేంద్రాలు ఎన్నో ఒకసారి గుర్తు తెచ్చుకొని మాట్లాడాలని.. చురకలు అంటించారు. నారాయణఖేడ్ ప్రాంతంలో మొదట మార్కెట్ యార్డ్ లేకుండేనని… ఇవాళ అటువంటి కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులు వానాకాలం వడ్లు కొట్టలేరని… నానా రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు. తడిసిన వడ్లు కొనకుండా చేసిన ఘన కార్యం బీజేపీదేనని నిప్పులు చెరిగారు హరీష్ రావు.