ఆ ఎమ్మెల్యేని లేపేస్తే రూ.కోటి ఇస్తా.. డీల్ వీడియో లీక్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయాల్లో నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు సర్వసాధారణమైన విషమే.. అవి కొన్నిసార్లు శృతి మించి ఇంకా ముందుకు సాగిన సందర్భాలు కూడా లేకపోలేదు.. రాజకీయ నేతలు హత్యకు గురైన ఘటనలు ఎన్నో ఉన్నాయి. నేతల మధ్య రాజకీయాల్లోనైనా ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని అందరూ కోరుకునే విషయం. అయితే, తాజాగా ఓ ఎమ్మెల్యే హత్యపై ఇద్దరి మధ్య కుదిరిన డీల్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది… బీజేపీ ఎమ్మెల్యేను హత్య చేస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ కర్ణాటక కాంగ్రెస్ నేత ఓ వ్యక్తితో డీల్ మాట్లాడుతున్న ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారిపోయింది..
Read Also: దూసుకొస్తున్న ‘జవాద్’.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
Also Read
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
ఇక, ఆ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేత గోపాలకృష్ణ ఓ వ్యక్తితో మాట్లాడుతున్న వీడియో ఒకటి లీక్ అయ్యింది.. ఆ వీడియోలో.. యలహంక బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఆర్ విశ్వనాథ్‌ను హత్య చేయాలని డీల్ మాట్లాడుతున్నారు గోపాలకృష్ణ.. ఆ ఎమ్మెల్యేను ఫినిష్ చేస్తే కోటి రూపాయలు ఇస్తానని.. ఈ విషయం చాలా గోప్యంగా మన ఇద్దరి మధ్యే ఉంటుందని చెప్పుకొచ్చాడు.. అది ఎవరు రికార్డు చేశారు.. ఎప్పుడు చేశారు.. అసలు ఎందుకు చేశారు అనేది తెలియాల్సి ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. ఈ వీడియోపై స్పందించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర.. దీనిపై విచారణ జరుగుతున్నట్టు తెలిపారు.. సదరు ఎమ్మెల్యేతో కూడా మాట్లాడని.. అదనపు భద్రత విషయంపై చర్చిస్తున్నామన్నారు.. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు వెల్లడించారు.
తాజావార్తలు
-
Mythri Ravi: ‘తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’
-
Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
-
AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
-
Nagarjuna: ‘పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే’
-
AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!