భారత రైతుల సమస్యల మీద టీఆర్ఎస్ లీడ్ తీసుకుంటుంది.. బీజేపీని వదలం.. చివరి రక్తం బొట్టు వరకు పోరాడుతామని వార్నింగ్ ఇచ్చారు సీఎం కేసీఆర్. వడ్ల కోసం పోరాటం మొదలు పెట్టినం, దేశం కోసం కూడా పోరాటం చేస్తామని ప్రకటించారు. దేశానికి విద్యుత్ ఇచ్చే తెలివి లేదు, కానీ మోటార్లకు మీటర్లు పెట్టాలట అంటూ కేసీఆర్ ఫైర్ అయ్యారు. గోల్ మాల్ గాళ్లకు గోరి కట్టాలి.. దేశంలో జెండా ఎగరాల్సిందే.. దేశ వ్యాప్తంగా ఉద్యమం లేపాల్సిందేనన్నారు. యాసంగిలో…
తెలంగాణ పండించే వడ్లు కొంటరా ? కొనరా ? అని ప్రశ్నించారు తెలంగాణ సీఎం కేసీఆర్. సూటిగా సమాధానం చెప్పకుండా వంకర టింకరగా సమాధానం చెబుతే బాగుండని హెచ్చరించారు సీఎం కేసీఆర్. ఇవాళ ఇందిరా పార్క్ లో నిర్వహించిన మహా ధర్నా లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… బీజేపీ మాట్లాడితే అబద్దాలని… అబద్దాలు మాట్లాడుతూ.. అడ్డగోలు పాలన చేస్తోందని ఫైర్ అయ్యారు. ఏడాదిగా ఢిల్లీ లో రైతులు ఆందోళనలు చేస్తున్నారని……
అమరావతిలో రాజధానిని నిర్మించేది బీజేపీనేనని… రాజధాని అమరావతిలోనే ఉండాలనేది బీజేపీ చెబుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర పదాధికారులు జిల్లా అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన సోము వీర్రాజు మాట్లాడుతూ… అమరావతి రైతుల పోరాటానికి బీజేపీ మద్ధతిస్తుందన్నారు. ఈ నెల 21న రైతుల పాదయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నామని…తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి అభివృద్ధి విషయంలో వెనకడుగు…
ధాన్యం కొనుగోలు అంశం నేపథ్యంలో కేంద్రంపై యుద్ధం ఇక ఆగబోదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కాసేపటి క్రితమే.. ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న మహా ధర్నాలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… కేంద్రం రైతుల పట్ల వ్యతిరేకతతో ఉందని… కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా యుద్ధానికి దిగామని స్పష్టం చేశారు. ఇది ఆరంభం మాత్రమే.. ఇంకా ఉధృతం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. పంజాబ్ లో కొన్నట్లు ఇక్కడ…
కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ పార్టీ అధినేత కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి నిరసనగా ధర్నాకు పిలుపునిచ్చారు. అయితే బీజేపీ నేతలేమో ధాన్యం కొనుగోలు చేతకాకనే కేంద్రంపై ఆరోపణలకు దిగుతున్నారని విమర్శిస్తున్నారు. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతల మాటలతో రైతుల్లో గందరగోళం నెలకొంది. స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన టీఆర్ఎస్కు పోరాటాలు కొత్తకావంటూ.. రైతుల కోసం పోరాటం చేస్తామంటూ అధికార పార్టీ నేతలు రోడ్లెక్కారు. అయితే తెలంగాణలో…
బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. బీజేపీ .. బద్మాష్ పార్టీ అని… తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. కేంద్ర ప్రభుత్వం ఏక పక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ రైతులు పండించిన పంటను ఎఫ్ సీఐ కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని ఐకెపి సెంటర్ల లో తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని తెలిపారు.ప్రధాని నరేంద్ర మోడీ స్పందించి తెలంగాణ ధాన్యం…
మొన్నటి వరకు కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించిన వెంకట్రామిరెడ్డి ఎన్నో ఆరోపణలు, విమర్శల నడుమ ఎమ్మెల్సీ పదవిని పొందారు. అయితే టీఆర్ఎస్ పార్టీ ఇందిరాపార్క్ వద్ద చేస్తోన్న మహాధర్నాలో పాల్గొన్న ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని అన్నారు. కేసీఆర్ కృషితో గతంలో కంటే 600 శాతం ఎక్కువ ధాన్యం పండుతోందని, రైతుల పంటలు కేంద్రం ఎందుకు కొనుగోలు చేయదని, అకస్మాత్తుగా రైతులు వరి పంట పండించొద్దని అంటే ఎలా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ చాలా…
కేంద్ర ప్రభత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ అధినేత ధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీవీతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. కేంద్రం వైఖరితో రైతుల కోసం కేసీఆర్ పోరాటం చేస్తున్నారని ఆయన వెల్లడించారు. సీఎం కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారని, దానికి స్పందన వచ్చిన తర్వాత మా కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ నేతలను ప్రజలు ఉరికిచ్చి కొడుతున్నారని, తెలంగాణలో…
రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఏమిటని ప్రశ్నించే ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతులు పండించే వరిని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం సిగ్గుచేటని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. గతంలో రైతులు పండించిన ప్రతి గింజా కొంటామని… కోటి ఎకరాల్లో సాగునీటి కోసమే కాళేశ్వరం తదితర సాగునీటి ప్రాజెక్టులున్నాయని… తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని గప్పాలు కొట్టిన కేసీఆర్ .. నేడు రైతుల పై రెండు…
రాష్ర్టంలో వరి ధాన్యం కొనుగోలు పై అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీలు పోటా పోటీగా ధర్నాలు చేస్తూ ఎవ్వరికి వారే మేమంటే మేము రైతుల పక్షం అని చెప్పుకుంటున్నారు. దీనిపై అధికార టీఆర్ ఎస్, ప్రతిపక్ష బీజేపీలు దాడులకు పాల్పడేంత వరకు వ్యవహారం వెళ్లింది. రైతులు రాష్ర్ట ప్రభుత్వ ప్రకటనలతో ఆత్మహత్యలు చేసు కుంటున్నారని బీజేపీ ఆరోపిస్తుండగా.. టీఆర్ఎస్ మాత్రం రైతులు బాగుండాలనే మేము కోరుకుంటున్నామని, కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకుంటే ఏం చేస్తామంటూ బీజేపీ…