బీజేపీని కేంద్రంలో అధికారం నుంచి తప్పించేందుకు టీఎంసీ అధినేత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కంకణం కట్టుకున్నారు. దీనికోసం నిత్యం అన్ని పార్టీల ప్రముఖ రాజకీయ నేతలను మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఆమె శరద్‌పవార్‌తో భేటీ అయ్యారు.
అనంతరం శరద్ పవార్ మాట్లాడుతూ.. బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయం కావాలన్నారు. అంతేకాకుండా టీఎంసీతో మాకు పాత అనుబంధం ఉందని గుర్తు చేశారు. మమతా బెనర్జీ మాట్లాడుతూ.. యూపీఏకి ఇక ఉనికి లేదన్నారు. యూపీఏతో సహా బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటికీ స్వాగతం అని ఆమె పిలుపునిచ్చారు. ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలన్నారు.