వరి ఉరి కాదు.. రైతుల పాలిట సిరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో గందరగోళ పరిస్థితులతో రైతు కన్నీరు పెడుతున్నాడు.. ధాన్యం మార్కెట్‌కు తరలించినా ఎప్పుడు కొంటారో తెలియని పరిస్థితి.. మరోవైపు వర్షాలతో కల్లాలు, రోడ్లపైనే ధాన్యం తడిసిసోయి రైతులను కన్నీరు పెట్టిస్తుంది.. అయితే, వరి ఉరి కాదు.. రైతుల పాలిట సిరి అంటున్నారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్.. వరి విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించిన ఆయన.. వానాకాలం పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని.. రైతుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్ దే బాధ్యత అన్నారు. రైతులతో చెలగాటం ఆడుతున్నారు. ధాన్యం దళారీలకు అమ్ముకోవాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. వరి ఉరి కాదు రైతుల పాలిట సిరి.. రబీలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వరి పంటను కొనాల్సిందేనని డిమాండ్ చేశారు.
Read Also: బిడ్డ కోసం చిరుతతో పోరాటం.. తల్లి ప్రేమ ముందు తోకముడిచిన క్రూరమృగం..
Also Read
ఇక, సీఎం కేసీఆర్ రైతుల పాలిట రాబంధులా తయారయ్యారని ఆరోపించిన ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్.. వ్యవసాయ మంత్రికి ఏ పంట ఎప్పుడు వస్తుందో ఇంగిత జ్ఞానం ఉందా ? అంటూ ఫైర్ అయ్యారు.. వ్యవసాయం గురించి తెలియని కేటీఆర్ కూడా మాట్లాడుతున్నాడు అంటూ సెటైర్లు వేశారు. మరోవైపు ఆర్టీసీ చార్జీల పెంపు ప్రతిపాదనపై స్పందించిన ప్రభాకర్.. ఆర్టీసీ చార్జీల పెంపు ప్రతిపాదనను బీజేపీ వ్యతిరేకిస్తుందన్నారు.. ప్రతిపాదనలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఆస్తులని టీఆర్ఎస్ నేతలు అతి తక్కువ ధరలకు లీజులకు తీసుకున్నారని ఆరోపించిన ఆయన.. ఆ లీజులను ప్రస్తుత మార్కెట్ ధరలకు పెంచాలని.. ఆర్టీసీ వాడే డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలని సూచించారు.
తాజావార్తలు
-
PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!