నిన్న ఉద్యోగల సమస్యల పరిష్కారానికై జాగర దీక్ష చేపట్టిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) స్పందిస్తూ బండి సంజయ్ అరెస్ట్‌ను ఖండిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంత్ రావు, నవాత్ సురేష్ మాట్లాడుతూ.. 317 జీవోలో సవరణలు చేయాలని శాంతియుతంగా జాగరణ దీక్ష చేపట్టిన బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడం…
బండిసంజయ్ అరెస్టు పై బీజేపీఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ ..కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. డిసెంబర్ 25న కోవిడ్ పై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు తరవాత కేసీఆర్ నల్గొండ పర్యటనకు వెళ్లారు… మాస్క్ లేదు.. వేల మంది హాజరయ్యారన్నారు. ఆ తర్వాత ktr నల్గొండ జిల్లాకు వెళ్లారు. నిబంధనలు ఉల్లంఘించారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. కేటీఆర్‌కు మాస్క్ లేదు. నిన్న కరీంనగర్లో గంగుల కమలాకర్ ప్రెస్‌మీట్ పెట్టాడు మాస్క్ లేదు. వీరికి…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై నిన్న కరీంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో జాగరణ దీక్షకు పిలుపునిచ్చారు. దీంతో బీజేపీ కార్యాలయం వద్దకు పోలీసులు చేరుకోవడంతో బీజేపీ నేతలు బండి సంజయ్‌ని కార్యాలయంలోకి పంపించి తాళం వేశారు. అయితే బండి సంజయ్‌ను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి నాటకీయ పరిణామాల నడుమ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ…
నిన్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఉద్యోగుల బదిలీల అంశంపై కరీంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో జాగరణ దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. దీంతో పోలీసులు నిన్న రాత్రి బండి సంజయ్ జాగరణ దీక్ష భగ్నం చేసేందుకు రాగా బండి సంజయ్‌ను కార్యకర్తలు కార్యాలయంలోకి పంపి తాళం వేశారు. దీంతో పోలీసులు రాత్రి 10 గంటల సమయంలో తలుపులు బద్దలు కొట్టి నాటకీయ పరిణామాల మధ్య బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు. అయితే ఈ రోజు కరీంనగర్ ఎక్సైజ్…
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని.. బీజేపీని అడ్డుకోవడానికి, ఉద్యమాలను అణచివేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మండి పడ్డారు బీజేపీ నాయకురాలు విజయ శాంతి. మమ్మల్ని చంపినా..4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం ఉద్యమం చేస్తామని విజయశాంతి అన్నారు. కేసీఆర్ ను గద్డె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బండి సంజయ్ కార్యకర్తలపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని, 317 జీవో సవరణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఫామ్ హౌజులో కూర్చోని రాత్రికిరాత్రి జీవోలు తీసుకువస్తున్నారని విమర్శించారు. పోలీసులు…
ఉద్యోగ బదీలీల అంశంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కరీంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో జాగరణ దీక్ష చేపట్టారు. అయితే కోవిడ్ నిబంధనలకు విరుద్దంగా ఆయన దీక్ష చేపట్టారంటూ నాటకీయ పరిణామాల మధ్య బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామన్ని ఆయన అన్నారు. అంతేకాకుండా తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని, బండి సంజయ్ కార్యాలయంలోకి బలవంతంగా వెళ్లి…
ఈ రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగం అమలువుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బండి సంజయ్ జాగరణ దీక్షను అడ్డుకోవడం పై ఆయన సోమవారం మాట్లాడుతూ ..కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ కేసులకు భయపడబోదన్నారు. కేసీఆర్ ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు.. ప్రగతి భవన్‌కు ఇనుపకంచెలు, ఫాంహౌస్‌కి గోడలు కట్టుకుని ఉంటున్నాడని ఆయన ధ్వజమెత్తారు. సీఎం ఒక చక్రవర్తిలా ఎవరి మాట వినను అంటున్నాడని ఆరోపించారు. కోవిడ్ నిబంధనలు ఉన్నాయని సంజయ్ తన…
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు.. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు.. ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీల కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317కు వ్యతిరేకంగా… కొన్ని నాటకీయ పరిణామాల మధ్య బండి సంజయ్ తలపెట్టిన దీక్షను భగ్నం చేసి.. ఆయనను ఆదివారం రాత్రి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే కాగా.. ఇవాళ కోర్టులో హాజరు పర్చారు.. అయితే, బండి సంజయ్ కోసం ఫోన్ చేశారు బీజేపీ జాతీయ…
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్ధం అయినట్టు తెలుస్తోంది.. ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీల కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317కు వ్యతిరేకంగా… బండి సంజయ్ తలపెట్టిన దీక్షను భగ్నం చేశారు పోలీసులు.. కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో జాగరణ దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు బండి సంజయ్.. ఓవైపు దీక్షకు మద్దతుగా జిల్లాల నుంచి వస్తున్న నేతలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.. మరోవైపు.. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య…
ఉద్యోగ బదీలీల అంశంపై జాగరణకు పిలుపునిచ్చిన బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతుండగా మైకుల్ని, కెమెరాలను లాగిన పోలీసులు వారి తీరుపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..నీ కొడుకు వేల మందితో ర్యాలీలు తీస్తే కోవిడ్ నిబంధనలు ఎటు పోయాయి.అధికార అహంకారంతో కేసీఆర్‌కు కళ్లు నెత్తికెక్కాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గర పడ్డాయన్నారు. కేసీఆర్ ….నీ అవినీతి సామ్రాజ్యాన్ని బద్దలు…