హైదరాబాద్‌లో వరుసగా కీలక సమావేశాలు జరుగుతున్నాయి.. అన్నోజిగూడలో ఆర్ఎస్ఎస్ సమావేశాలు ఇవాళ్టితో ముగిసిపోయాయి.. అయితే, ఇదే సమయంలో కాంగ్రెస్ మీటింగ్‌కు అనుమతి ఇవ్వకపోవడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారంపై స్పందించిన ఏఐసీసీ ఇంచార్జ్ మనిక్కమ్ ఠాగూర్.. కాంగ్రెస్ పార్టీ 120 మందితో 9 నుంచి 11 వరకు హైదరాబాద్ శిక్షణ శిబిరాలు పెట్టుకుంటామంటే అనుమతి ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం.. 300 మందితో సంఘ్ శిక్షణకు భద్రత, అనుమతి ఇచ్చిందని.. ఇదేమి ద్వంద్వ నీతి, ఢిల్లీలో దోస్తీ ఇప్పుడు గల్లిలో కూడా దోస్తీనా? అంటూ సెటైర్లు వేశారు.. ఇక, ఈ అంశంపై స్పందించిన టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఠాగూర్ చెప్పిన్నట్లు బీజేపీకి వర్తించని కోవిడ్ రూల్స్ కాంగ్రెస్ కే వర్తిస్తాయా..? అంటూ ఫైర్ అయ్యారు.
Read Also: ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యం.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
ఆర్ఎస్ఎస్ శిక్షణ తరగతులకు సర్కార్ అనుమతి ఇస్తుంది.. కానీ, కాంగ్రెస్ శిక్షణా తరగతులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిన ఆయన.. నేనే రాష్ట్ర డీజీపీని అడుగుతున్నా.. బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ నడ్డా కూడా వచ్చారు.. వారికి లేని కోవిడ్ మాకే ఉందా..? అని నిలదీశారు.. సెంట్రల్ పోలీస్, కేంద్ర సర్కార్ బీజేపీది కాబట్టి అనుమతి వస్తుందా..? కాంగ్రెస్ కు.. రాష్ట్రంలో కేంద్రంలో పవర్ లేదని పర్మిషన్ ఇవ్వరా ? అంటూ దుయ్యబట్టారు జగ్గారెడ్డి.. కోవిడ్ నిబంధనలకు లోబడే శిక్షణ తరగతులను నిర్వహిస్తాం.. సంఖ్య పరంగా చూస్తే కాంగ్రెస్ ది 120 నుండి 150 మంది, ఆర్ఎస్ఎస్ వాళ్ల మీటింగ్ కు 300మంది హాజరయ్యారన్న జగ్గారెడ్డి.. ఎక్కడా వాళ్లు కోవిడ్ నిబంధనలు పాటించడం లేదన్నారు.. వెంటనే ఈ వ్యవహారంపై డీజీపీ స్పందించాలని డిమాండ్ చేశారు.