కేసీఆర్ ఇంత పిరికివాడు అని అనుకోలేదు : మధ్యప్రదేశ్ సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్‌పై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణకు విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ దమ్మున్నోడు అనుకున్నా.. కానీ ఇంత పిరికివాడు అని అనుకోలేదు అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని జైల్లో పెట్టాడంటే ఎంత భయపడ్డాడో అర్థం అవుతోందని, కృష్ణుడు కూడా జైల్లోనే పుట్టాడు.. కానీ కంసుడిని ఏం చేశారు.. ఇప్పుడు కేసీఆర్ కూడా కంసుడిలాగే భయపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. నీ అన్యాయ పాలనకు నిప్పు పెట్టేదాక విడిచిపెట్టం.. మా పార్టీ నేతలపై లాఠీ ఝుళిపిస్తావా.. నిన్ను అంత ఈజీగా విడిచిపెట్టం.. మేము బిర్యానీ అనుకున్నావా.. తినడానికి.. పొట్టను చీల్చుకుంటూ వస్తాం.. కేసీఆర్.. అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. నీకు నువ్ ఏమనుకుంటున్నావ్.. కేసీఆర్.. కేసీఆర్ కలలో కూడా బండి సంజయ్ వస్తున్నట్టున్నాడు.. కేసీఆర్ సీఎం, కేటీఆర్ మంత్రి, బిడ్డ ఎమ్మెల్సీ, అల్లుడు మంత్రి.. ఇంకా ఎవరన్న ఉంటే వారిని కూడా చేస్తాడేమో, కేసీఆర్ మోడీ ని సేల్స్ మాన్ అంటున్నాడు.. మోడీ సేల్స్ మెన్ ఏ… దేశ ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తం చేస్తున్నాడని ఆయన వెల్లడించారు.
నీవు రెండో సారి సీఎం వే…. కానీ నేను నాలుగోసారి సీఎం అయ్యాను, సోనియాగాంధీ మాపై పోటీకి భయపడుతోంది.. పంజాబ్ లో అన్యాయంగా ప్రధాని మోడీని అడ్డుకున్నారు. అక్కడ సోనియా గాంధీ, ఇక్కడ కేసీఆర్.. ఒకేలా తయారయ్యారు. కేసీఆర్ ముందు సమాధానం చెప్పు.. నిరుద్యోగులకు ఉద్యోగలిచావా, నిరుద్యోగ భృతి ఇచ్చావా.. దళితులకు మూడెకరాల భూమి ఇచ్చావా? నువ్వొక భయపడే ముఖ్యమంత్రివి కేసీఆర్.. 2023 లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం, కేసీఆర్ నీకు చెప్తున్నా.. అంధకారం పోయి తెలంగాణలో వెలుగులు విరజిమ్మేలా చేస్తాం.. గుర్తుంచుకో..ధర్మయుద్దం మొదలయింది.. అంటూ ఆయన సవాల్ విసిరారు. మీరు పోరాడండి బండి సంజయ్.. మేమున్నాం. నీకో కథ చెప్తా.. విను కేసీఆర్.. ఒక ఋషి ఎలుకను పులిని చేసినట్టు.. నిన్ను ప్రజలు సీఎం చేస్తే.. వారిపైనే అన్యాయంగా కేసులు పెడతావా.? ఇంకా తెలంగాణను ఎంత దోచుకుంటావ్.. ప్రజలు పులిని.. తిరిగి ఎలుకగా చేయాల్సిన సమయం వచ్చేసింది. నీకు దమ్ము ఉంటే మమ్మల్ని తొక్కి చూపెట్టు కేసీఆర్ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
తాజావార్తలు
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?