గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌తో సోము వీర్రాజు భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌తో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌తో భేటీ అంశాలను వీర్రాజు మీడియాకు వెల్లడించారు. పంజాబ్‌లో ప్రధాని పర్యటన సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరు అనుమానాస్పదంగా ఉందని సోము వీర్రాజు అన్నారు. దేశ బోర్డరుకు పది కిలోమీటర్లు, పాకిస్తాన్‌కు దగ్గరలో ఉన్న ప్రాంతమని అలాంటి చోట ప్రధానికి రక్షణ కల్పించలేకపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిందన్నారు.
ప్రధాని లాంటి పెద్దలకు బ్రిడ్జిలు వచ్చినప్పుడు భద్రత మరింత కట్టుదిట్టం చేయాలి కానీ పంజాబ్ ప్రభుత్వం దీనికి విరుద్ధంగా వ్యవహరించిందన్నారు. సోనియా గాంధీ దేశ ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి రాజకీయ నాయకుడి మాదిరిగా మాట్లాడుతున్నారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమన్న సంగతిని మర్చిపోయారన్నారు. ప్రధాని మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మాగాంధీ విగ్రహాల వద్ద మౌనదీక్ష చేపడుతున్నామని, 13వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని సోము వీర్రాజు తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!