ధర్మయుద్ధంలో బీజేపీయే గెలిచిందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షడు లక్ష్మణ్ అన్నారు. బండి సంజయ్ అరెస్టు ..తదనంతర పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వానికి చురకలు అంటించారు. కోర్టులో ధర్మం గెలిచిందని కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు.నైతిక బాధ్యత వహించి సీఎం రాజీనామా చేయాలన్నారు. Read Also:అధికారులు పింక్ దుస్తులు వేసుకుని గుండాగిరి చేస్తున్నారు: తరుణ్ చుగ్ రాజకీయంగా ఎదుర్కొలేక తప్పుడు కేసులుపెట్టారన్నారు. తప్పుడు కేసులకు బీజేపీ ఏమాత్రం అదరదు బెదరదని లక్ష్మణ్ పేర్కొన్నారు. మాజీ…
ఐపీఎస్ అధికారులు ఖాకీ దుస్తులు వదిలి పింక్ బట్టలు వేసుకున్నారని, పింక్ దుస్తుల్లో గుండాగిరి చేస్తున్నారని, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం, అధికారులపై ఫైర్ అయ్యారు. బండి సంజయ్ అరెస్టు సందర్భంగా అనుచితంగా వ్యవహరించిన ఆ అధికారిపై సభా హక్కుల ఉల్లంఘన కేసు ఉందన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆందోళనలో పాల్గొన్న వాళ్లు ఈ రోజు మాతో ఉన్నారు.…
ఆంధ్రప్రదేశ్‌లో కుల రాజకీయం కొత్త కాదు.. కానీ, మరోసారి కులరాజకీయం తెరపైకి వస్తోంది.. తాము అంటే తామేనని ప్రకటిస్తున్నారు నేతలు.. తాజాగా, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. కాపులపై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఏపీలో కాపు సామాజిక వర్గం రాజకీయంగా నష్టపోయిందన్న ఆయన.. కాపులకు న్యాయం జరిగేది బీజేపీతోనే అని ప్రకటించారు.. ఇక, ప్రజాగ్రహ సభ తర్వాత టీడీపీ, బీజేపీల గుండెల్లో రైళ్లు పరుగెట్టాయని చెప్పుకొచ్చారాయన.. భారతీయ జనతాపార్టీది సబ్ కా సత్ సబ్ కా వికాస్…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో నేడు బీజేపీ శ్రేణులు ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో పాల్గొనడానికి ఢిల్లీ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అయితే జేపీ నడ్డాను అడ్డుకునేందుకు అప్పటికే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న పోలీసులు తెలంగాణలోని కోవిడ్ నిబంధనల గురించి వివరించారు. దీంతో ఆయన కోవిడ్ నిబంధనల ప్రకారమే నిరసన తెలియజేస్తానన్నారు. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్…
బండి సంజయ్ బెయిల్ పిటిషన్‌ను కరీంనగర్ స్థానిక కోర్టు తిరస్కరించడంతో.. ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిందే సంగతి తెల్సిందే.. బెయిల్ ఇప్పించాలని.. తనపై పెట్టిన కేసులను కొట్టి వేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ లక్ష్మణ్ బెంచ్.. ఎమ్మెల్యే, ఎంపీలకు సంబంధించిన కేసుల విచారణకు తనకు రోస్టర్ లేదని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల సంబంధించిన కేసులు విచారణ జరిపే కోర్టుకు వెళ్ళాలని బండి సంజయ్ తరపు న్యాయవాదికి సూచించారు. ఈ పిటిషన్‌ను…
ఉదయం నుంచి ఎంతో హీట్ పుట్టించిన బీజేపీ ర్యాలీ కార్యక్రమం ముగిసింది. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సికింద్రాబాద్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్దకు రోడ్డు మార్గంలో చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో జాయింట్ సీపీ కార్తికేయకు చెప్పిన విధంగానే తాను కోవిడ్ నిబంధనల ప్రకారం నిరసన తెలియజేశారు. అయితే మహాత్మాగాంధీ విగ్రహం వద్దకు చేరకున్న జేపీ నడ్డా నివాళులు అర్పించి బీజేపీ నిరసన కార్యక్రమాన్ని ముగించారు. అయితే ఉదయం నుంచి బీజేపీ…
గత రెండు రోజులుగా తెలంగాణ బండి సంజయ్ అరెస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. అయితే బండి సంజయ్ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ బీజేపీ నేడు సికింద్రాబాద్‌లోని మహత్మాగాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహిచేందుకు పిలుపు నిచ్చారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఢిల్లీ నుంచి చేరుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న జేపీ నడ్డాను ఆహ్వానించేందుకు కొందరినీ మాత్రమే ఎయిర్‌పోర్ట్‌లోకి అనుమతించారు. అయితే అనుమతించిన…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను గత రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ శ్రేణులు ఒక్కసారి భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో నేడు సికింద్రాబాద్‌లోని మహ్మత్మాగాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ సర్కిల్ వరకు బీజేపీ శ్రేణులు భారీగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ ఈ రోజు సాయంత్ర 5 గంటలకు నిర్వహించనున్నట్లు బీజేపీ నేతలు వెల్లడించారు. అయితే ఈ ర్యాలీలో పాల్గొనడానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రానున్నారు.…
గత రెండు రోజులుగా తెలంగాణలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, జీవో 317లో సవరణల కోసం బీజేపీ చీఫ్ బండి సంజయ్ జాగరణ దీక్ష చేపట్టారు. దీంతో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు. అంతేకాకుండా మరుసటి రోజు కోర్టులో హజరుపరిచారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు సికింద్రబాద్‌లో…
ఈ నెల 2వ తేదీన కరీంనగర్లో బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ అరెస్ట్‌ను నిరసిస్తూ.. బీజేపీ శ్రేణులు నేడు సాయంత్రం సికింద్రాబాద్ నుంచి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ.. ముందుగా నిర్ణయించిన ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ ర్యాలీ…