తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. దీక్షకు దిగిన సంజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత జైలుకు వెళ్లిన ఆయన.. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి ఇవాళ తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు.. ఈ సందర్భంగా స్వాగత సభ ఏర్పాటు చేసింది రాష్ట్ర నాయకత్వం.. ఈ సభలో సంజయ్ మాట్లాడుతూ.. మరోసారి ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేశారు.. కేసులు, అరెస్టులు నీకు ఆయుధాలు అయితే.. జైళ్లనే కేంద్రాలుగా చేసుకొని పోరాడుతాం అన్నారు.. బరితెగించి బలుపు ఎక్కి నిరుద్యోగుల, ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నావు అంటూ ఫైర్ అయిన ఆయన.. నీ పార్టీ ఎంత కేసీఆర్.. అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ మాది, కేంద్రంలో అధికారంలో ఉంది.. గాయపడ్డ, జైలుకు వెళ్లిన కార్యకర్తలు ఎవరు భయపడడం లేదు.. యుద్ధ రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
Read Also: బ్రేకింగ్: ఉద్యోగ సంఘాలకు మళ్లీ పిలుపు.. ఇవాళే పీఆర్సీ ప్రకటన..!
ఏ ఉద్యోగుల సకల జనుల సమ్మెతో సీఎం అయ్యావో ఆ ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నావు అని కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు బండి సంజయ్.. నేను ఉపాధ్యాయుడు కొడుకుని… మీ బాధ చూస్తుంటే మా తండ్రి బాధ పడుతున్నట్టే అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం పోరాడుతామని వెల్లడించారు. ఇక, సీపీ, డీజీపీలు సీఎం కేసీఆర్‌కు కొమ్ముకాస్తున్నారని ఆరోపించిన ఆయన.. ఉద్యోగ, ఉపాధ్యాయులారా మీ నాయకులు కేసీఆర్ సంక నాకేతందుకు ఉన్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. 2023లో బీజేపీ అధికారంలోకి వస్తుంది.. ఆ వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయులు మళ్లీ మీ సొంత ఇంటికి వచ్చేలా చేస్తామని ప్రకటించారు బండి సంజయ్.. నేను నా కార్యాలయంలో దీక్ష చేస్తే కేసీఆర్‌కి ఏమి నొచ్చింది అంటూ మండిపడ్డ ఆయన.. తెలంగాణ సమాజం అంత కేసీఆర్ ని తొక్కాలి తొక్కాలి అంటుంది.. కేసీఆర్ నిన్ను వదిలిపెట్టబోం.. నిన్ను జైలుకు శాశ్వతంగా పంపించాలి అని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.