నేడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా సూపర్‌స్టార్ కృష్ణతో పాటు పలువురికి సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా గుర్తింపు పొందని స్వాతంత్ర సమర యోధులను గుర్తించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. బ్రిటిష్ వారికి వణుకు పుట్టించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, అల్లూరి లేకపోతే మనలో ఆ తెగింపు రాదు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అత్యధికంగా…
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రధాని మోడీతో భేటి కానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి ప్రధాని మోడీతో సీఎం జగన్ పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర సమస్యలపై ప్రధాని మోడీకి సీఎం జగన్ వినతిప్రతం అందజేయనున్నారు. అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులను సీఎం జగన్ కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్ట్, జల వివాదాలపై ప్రధానితో జగన్ చర్చించనున్నారు.…
వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. తాజా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో దుర్మార్గమైన పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా కేంద్ర నిధులిస్తుంటే జగన్ తన సొంత పథకాల పేరుతో ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రాన్ని ఆదాయ వనరుగా చేసుకొని జగన్ దోచుకుంటున్నారన్నారు. సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వ జోక్యం తగదని ఆయన హితవు పలికారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చేరవేసేందుకు బీజేపీ తరుఫున మండల…
రాష్ట్రంలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వినూత్న రీతిలో నిరసనకు సిద్ధమయ్యారు. నిద్రపోతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని మేల్కొలిపి ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్తుకు గొడ్డలి పెట్టుగా ఉన్న 317 జీఓను ఉపసంహరించుకునేలా రేపు రాత్రంతా కరీంనగర్లో జాగరణకు పిలుపునిచ్చారు. కరీంనగర్ లోని తన కార్యాలయంలో రేపు (జనవరి 2) రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు (జనవరి 3) ఉదయం 5 గంటల…
సీఎం. . ఈ పదం.. ఈ పదవి ఏపీ కాపులకు అందని ద్రాక్షా. ప్రతి పదేళ్లకోసారి ఆ వర్గం నుంచి ఓ నేత రాజకీయాల్లోకి రావడం .. ఫెయిల్ కావడం జరిగిపోయాయి. అదే ఇప్పుడు ఆ సామాజికవర్గంలో ఆందోళన కలిగిస్తోందట. చిరంజీవి.. పవన్ పొలిటికల్‌గా ఫెయిల్ అయ్యారు. ఇక మనకు రాజయోగం లేదా అనే ఆందోళనలో కొత్త వ్యూహంపై దృష్టిసారించారట. కలిసి వచ్చే కులాలను కలుపుకెళ్లాలనే ఆలోచనఏపీలో కాపులు సంఖ్యా పరంగా పెద్ద సామాజికవర్గం. ఏదో ఒక…
ఎప్పుడు ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉండే వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఈ సారి ఏపీ బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఏపీ బీజేపీ నేతలను విమర్శిస్తూ ట్వీట్ చేశారు. బీజేపీ నేతలు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజాదరణ పొందుతుంటే అది బీజేపీ నేతలకు నచ్చడం లేదు. అందుకే ప్రభుత్వం పై ఎప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా ఆయన బీజేపీ నేతలను తీవ్రంగా విమర్శించారు. Read Also: మహిళలను హింసించడం…
కరీంనగర్లో రేపు రాత్రి 9 గంటల నుంచి 3 జనవరి ఉదయం 5 గంటల వరకు జాగరణ చేయాలని బీజేపీ నిర్ణయించిందని బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ హజరవుతారని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు, పోలీసులకు, టీచర్లకు బదిలీలకు సంబంధించిన 317 జిఓ ఉద్యోగ సంఘాలతో చర్చించి సవరించాలని డిమాండ్ చేస్తు జాగరణ చేస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. Read…
జగన్ ఎప్పుడు జైలుకు పోతారో తెలియదని..రాబోయేది జగన్ కు ఒడిదుడుకుల సమయమని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు. జగనే కాకుండా ఎవరు ఎప్పుడు జైలుకు వెళతారో తెలియదని పేర్కొన్నారు. ఎప్పుడూ వినని వందల రకాల మద్యం బ్రాండ్స్ వున్నాయని… అడిగే వాడే లేడని పెంచి అమ్ముతున్నారని మండిపడ్డారు. మద్యం ప్రియులను దోచేస్తూ వారి నుంచి వచ్చే డబ్బులతో ప్రభుత్వం నడుపుతున్నారు..కొన్న దానికన్నా పది రెట్లు ఎక్కువ చేసి మద్యాన్ని అమ్ముతున్నారని ఆగ్రహం…
ప్రతిపక్షాలపై వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..ఇది వైసీపీకి అభివృద్ధి, సంక్షేమ నామ సంవత్సరమని, బీజేపీకి మద్యపాన సంవత్సరమని, జనసేనకు ప్యాకేజీ నామ సంవత్సరం అని మొత్తంగా విపక్షాలకు ఏడుపునామ సంవత్సరమని అంబటి వ్యాఖ్యానించారు. అమరావతి ఇక్కడే ఉంటుందన్నారు. బీజేపీ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీ పార్టీనా జూదం పార్టీనా? జిన్నా టవర్‌ను పేల్చేస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో బుద్ధుడి విగ్రహాన్ని…
ఏపీ రాజకీయాలు బీజేపీ నేత సోమువీర్రాజు లిక్కర్ గురించి మాట్లాడిన మాటలపై నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఒక హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని బహిరంగగానే విమర్శిస్తున్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా వైసీపీ నేత విజయసాయిరెడ్డి దీనిపై తనదైన స్టైల్లో విమర్శల బాణాలు సంధించారు. Read Also: చెప్పులపై జీఎస్టీ వేయడమేంటి..?: నారాయణ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ర్టంలో వేరే పార్టీలను ఆదరించే పరిస్థితి లేదని వైసీపీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. జగన్ గారి సంక్షేమ…