Trump: ఓ వైపు కోర్టు మొట్టికాయలు.. ఇంకోవైపు ట్రంప్ దూకుడు.. అన్ని దేశాలపై 10 శాతం టారిఫ్ విధింపు
- ఓ వైపు కోర్టు మొట్టికాయలు
- తగ్గేదేలేదన్న అధ్యక్షుడు ట్రంప్
- తాజాగా అన్ని దేశాలపై 10 శాతం టారిఫ్ విధింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధ్యక్షుడు ట్రంప్‌కు అమెరికా అత్యున్నత న్యాయస్థానంలో భారీ ఎదురుదెబ్బ తగలింది. గ్లోబుల్ టారిఫ్‌లను కొట్టేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ పరిణామంపై ట్రంప్‌కు భారీ షాక్ తగిలినట్లైంది. దీంతో న్యాయమూర్తులపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మూర్ఖులు.. లాప్‌డాగ్‌లు’’ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కోర్టు సిబ్బంది తీరును చూసి సిగ్గుపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Off The Record : కవితను లైట్ తీసుకోవడమే బెటరని బీఆర్ఎస్ నేతలు డిసైడయ్యారా?
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
అలా కోర్టు మొట్టికాయలు వేసిందో లేదో.. మరోసారి ట్రంప్ తన ప్రతాపాన్ని చూపించారు. అన్ని దేశాలపై 10 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఓవల్ కార్యాలయం నుంచి కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేసి సోషల్ మీడియాలో వెల్లడించారు. కొత్త ఉత్తర్వు ప్రకారం అన్ని దేశాల నుంచి దిగుమతులపై 10 శాతం సుంకం విధించినట్లు పేర్కొన్నారు. అన్ని దేశాలపై 10 శాతం సుంకం విధించడంపై తాను గర్వపడుతున్నట్లు చెప్పారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని రాసుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Duddilla Sridhar Babu : డిజిటల్ గవర్నెన్స్ లో రోల్ మోడల్ గా తెలంగాణ
అంతకముందు మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 122 కింద ప్రస్తుత సుంకాలను అదనంగా 10 శాతం ప్రపంచ సుంకాన్ని ఆదేశిస్తానని చెప్పారు. అవసరమైతే దానికంటే ఎక్కువ సుంకాలను విధించగలను అని హెచ్చరించారు. వాణిజ్య చట్టంలోని సెక్షన్ 122 కింద విధించిన సుంకాలు దాదాపు ఐదు నెలల వరకు అమలులో ఉంటుందన్నారు.

తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!