బీజేపీతో పొత్తును వీడి జనసేన బయటకు రావాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు ఎన్నికలు ఏమీ లేవు.. అయినా ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.. కుప్పం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన లవ్ కామెంట్లపై పెద్ద రచ్చ జరుగుతోంది.. జనసేన పార్టీని ఉద్దేశించి చంద్రబాబు ఆ కామెంట్లు చేయగా.. బీజేపీ, వైసీపీ ఈ వ్యవహారంపై మండిపడుతోంది.. జనసేన పార్టీ తమకు మిత్రపక్షమని బీజేపీ అంటుంటే.. పొత్తులు లేకుండా చంద్రబాబు ఒక్కసారైనా గెలిచారా? అని వైసీపీ ప్రశ్నిస్తోంది.. ఇక, ఈ వ్యవహారంపై ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తులు, సర్దుబాట్లు ఉంటాయన్నారు.. జాతీయస్థాయిలో అగ్రనేతల నిర్ణయం మేరకు పొత్తులు ఉంటాయన్న ఆయన.. ఇదే సమయంలో.. జనసేన పార్టీ.. బీజేపీతో పొత్తును వీడి బయటకు రావాలని సూచించారు.. ఇక, దేశాన్ని కాపాడాల్సిన ప్రధాని మోడీయే తన ప్రాణాలకే ముప్పు ఉందని చెప్పటం విడ్డూరమని సెటైర్లు వేసిన రామకృష్ణ.. నరేంద్ర మోడీ ఓట్ల రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
Read Also: కరోనా ఎఫెక్ట్.. పవన్ కల్యాణ్ సమావేశం వాయిదా
Also Read
- AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
- YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
- AP JUDA: స్టైపెండ్ పెంపుపై జూడాల అసంతృప్తి.. ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు
మరోవైపు.. సీఎం వైఎస్ జగన్ పీఆర్సీ విషయంలో ఉద్యోగులను నిరుత్సాహానికి గురిచేశారని విమర్శించారు రామకృష్ణ.. ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని.. కొందరు ఉద్యోగ సంఘ నేతలు బాగానే ఉందని కంటి తుడుపు మాటలు మాట్లాడుతున్నారని.. సజ్జల రామకృష్ణారెడ్డి.. ఉద్యోగ సంఘాల నేతలతో సంతృప్తిగా ఉందని పాజిటివ్ స్టేట్ మెంట్స్ ఇప్పించారని ఆరోపించారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 62కు పెంచడం ఆమోదయోగ్యంగా లేదన్న రామకృష్ణ.. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావని వ్యాఖ్యానించారు. ఇక, అమరావతి విషయంలో ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని మన్నించాలని.. రాజధానిగా అమరావతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు రామకృష్ణ.
తాజావార్తలు
-
AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
-
US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
-
CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్!
-
Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!