Arvind Kejriwal: ఢిల్లీ మద్యంపాలసీలో ఎలాంటి తప్పు లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మనీష్ సిసోడియా ఢిల్లీ అభివృద్ధి కోసం పనిచేశారని, అందుకే సిసోడియాను అరెస్ట్ చేశారని, మంచి పని జరగాలని ప్రధాని కోరుకోవడం లేదని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వం చేసిన మంచి పనిని ఆపడానికే తన క్యాబినెట్ మంత్రులు మనీష్ సిసోడియా,సత్యేందర్ జైన్లను కటకటాల వెనక్కి నెట్టారని అన్నారు.
Stray Dogs Issue: దేశంలో వీధికుక్కల దాడులు ఇటీవల కాలంలో చర్చనీయాంశం అయ్యాయి. తెలంగాణలో వీధికుక్కులు ఏకంగా ఓ నాలుగేళ్ల బాలుడిపై దాడి చేసి దారుణంగా చంపాయి. ఇదే విధంగా పలు రాష్ట్రాల్లో చిన్నారులపై వీధి కుక్కలు దాడులు చేశాయి. ఇదిలా ఉంటే జార్ఖండ్ బీజేపీ ఎమ్మెల్యే బిరంచి నారాయణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో వీధికుక్కల అంశాన్ని లేవనెత్తారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నేపథ్యంలో ఆప్‌పై దాడి చేసేందుకు బీజేపీ సరికొత్తగా బాహుబలి చిత్రంలోని కొన్ని క్లిప్‌లను వినియోగించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అరెస్టు చేసిన కొద్ది రోజుల తర్వాత ఇది జరగడం గమనార్హం.
Meghalaya: నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్ మార్చి 2న వెలువడబోతున్నాయి. ఇదిలా ఉంటే త్రిపురలో సొంతంగా బీజేపీ అధికారంలో వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ అంచనా వేశాయి. దీంతో పాటు నాగాలాండ్ రాష్ట్రంలో మిత్రపక్షం ఎన్‌పీపీతో కలిసి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది.
PM Narendra Modi: దేశంలో వేగంగా విమానయాన రంగం విస్తరిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మరికొన్ని రోజుల్లో కర్ణాటకలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అక్కడి అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు మోదీ. మరోసారి కర్ణాటకలో అధికారం చేజిక్కించుకోవాలని అనుకుంటోంది బీజేపీ. దీంతో భాగంగానే కొద్ది రోజుల వ్యవధిలో రెండుసార్లు కర్ణాటకలో పర్యటించారు ప్రధాని. ఇదిలా ఉంటే సోమవారం శివమొగ్గలో నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. హవాయ్ చెప్పులేసుకునే వారు కూడా విమానం ఎక్కాలన్న తమ…
BJP To Win Big In Tripura, Nagaland, Show Exit Polls: ఈశాన్య రాష్ట్రాల్లో మళ్లీ కమలం విరబూస్తుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టంగా చెబుతున్నాయి. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే మేఘాలయ రాష్ట్రంలో మాత్రం బీజేపీకి చుక్కెదురు అయ్యే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది.
Sanjay Raut On Manish Sisodia Arrest: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఆదివారం సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ రోజు కోర్టు ముందు రిమాండ్ కోసం ప్రవేశపెట్టారు. ఈ కేసులో ఏ-1 సిసోడియానే అని సీబీఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని రోస్ ఎవెన్యూ కోర్టు రిమాండ్ పై తీర్పును రిజర్వ్ చేసింది. మద్యం కుంభకోణంలో విచారణ నిమిత్తం మంత్రిని ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టులో సీబీఐ కోరింది.…